పాజిటివ్ ప్రారంభం...నిముషాల్లో నష్టాల్లోకి
By Sakshi

గత రెండు ట్రేడింగ్ సెషన్లలో భారీగా నష్టాల్ని చవిచూసిన భారత్ సూచీలు మంగళవారం పాజటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 107 పాయింట్ల లాభఃతో 38,138 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,372 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిముషాలకే హెవీవెయిట్ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లలో తలెత్తిన అమ్మకాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ 38,000 దిగువకు పడిపోగా, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,335 పాయింట్ల వద్దకు తగ్గిపోయింది. భారతి ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు ట్రేడింగ్ ప్రారంభంలో 1-2 శాతం మధ్య పెరగ్గా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2 శాతం, హెచ్డీఎఫ్సీ 1.5 శాతం, యస్‌బ్యాంక్ 3.5 శాతం, జీ టెలి 1.2 శాతం చొప్పున తగ్గాయి.
You may be interested
స్వల్పంగా తగ్గిన చమురు
Tuesday 23rd July 2019మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఒత్తిళ్ల వలన చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా అవసరమైనప్పుడు ప్రతిస్పందిస్తామని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎజెన్సీ (ఐఈఏ) తెలపడంతో మంగళవారం చమురు ధరలు స్వల్పంగా తగ్గి ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ చమురు డిమాండ్ భయాలు కూడా మదుపర్లను వెంటాడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 2 సెంట్లు తగ్గి బ్యారెల్‌కు 63.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్ బ్యారెల్‌కు 6 సెంట్లు తగ్గి 56.16 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. బ్రిటీష్ ట్యాంకర్‌ను
క్రిస్మస్ నాటికి 10,000కు నిఫ్టీ..!
Monday 22nd July 2019ఒకవైపు దేశ ఆర్థిక రంగ వృద్ధి ప్రతికూలంగా ఉండడం, మరోవైపు అంతర్జాతీయంగానూ వృద్ధి పరుగులు తీసేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడం... మరోవైపు పన్నుల భారంతో ఎఫ్‌పీఐల అమ్మకాలు, కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వెరసి మన ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో చిక్కుకున్నాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయి అయిన 11,300కు సమీపానికి వచ్చేసింది. ఇది కీలకమైన మద్దతు స్థాయి అని, రానున్న రోజుల్లో మార్కెట్లు ఇంకా దిద్దుబాటుకు