News


పాజిటివ్‌ ప్రారంభం

Thursday 27th June 2019
Markets_main1561606836.png-26602

ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో గురువారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 42 పాయింట్ల లాభంతో 39.634 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు జంప్‌చేసి 11,861 పాయింట్ల వద్ద మొదలయ్యాయి.

ట్రేడ్‌ డీల్‌ ఆశలు...ఆసియా మార్కెట్లు అప్‌ 

ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రీమియర్‌ జీపింగ్‌ల మధ్య జపాన్‌లో జరగనున్న వాణిజ్య చర్చలు ఫలప్రదం కావచ్చొన్న అంచనాలతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు పెరిగాయి. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఒక ప్రాధమిక అంగీకారం కుదిరిందని, జపాన్‌లో జరిగే జీ-20 దేశాధ్యక్షుల సదస్సు సందర్భంగా ఈ ఒప్పందంపై ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. ఈ వార్తలతో చైనా షాంఘై ఇండెక్స్‌ 1.5 శాతం జంప్‌చేయగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 1 శాతం, తైవాన్‌ వెయిటెడ్‌ 1 శాతం చొప్పున పెరిగాయి. జపాన్‌ నికాయ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పి సూచీలు అరశాతం చొప్పున ఎగిసాయి. 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 27th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సదన నైట్రోకెమ్‌:- స్ట్రిక్స్ వైర్‌లెస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని విలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.  అదానీ పోర్ట్స్‌:- సింగపూర్‌ ఎక్చ్సేంజీలో లిస్ట్‌ అయ్యే సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ నోట్ల జారీ ద్వారా రూ 750 మిలియన్‌ డాలర్ల సమీకరణకు ఫైనాన్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. వెల్‌స్పన్‌ ఇండియా:- సెన్స్‌ ఆర్గానిక్‌ ఇంపోర్ట్‌, ట్రేడింగ్‌ కంపెనీతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది.

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌

Thursday 27th June 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూలత కారణంగా గురువారం భారత్‌ మార్కెట్‌ పాజిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.45 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,884 పాయింట్ల వద్ద కదులుతోంది. బుధవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూన్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ 11,864 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌,

Most from this category