News


పాజిటివ్‌ ఓపెనింగ్‌...సెన్సెక్స్‌ 116 పాయింట్లు అప్‌

Wednesday 22nd May 2019
Markets_main1558496508.png-25871

క్రితం రోజు..ఆల్‌టైం గరిష్టస్థాయి నుంచి లాభాల స్వీకరణతో క్షీణించిన భారత్‌ మార్కెట్‌ బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 116 పాయింట్ల లాభంతో 39,086 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 11,728 పాయింట్ల వద్ద మొదలయ్యింది.  తాజాగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నేటినుంచి ఎక్స్‌డివిడెండు అయిన ఐటీసీ ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి రూ. 306.5 స్థాయికి చేరింది. టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, జీ టెలిలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. క్రితం రోజు క్యూ4 ఫలితాల్ని వెల్లడించిన టెక్‌ మహింద్రా 2.5 శాతం గ్యాప్‌డౌన్‌తో రూ.754 వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, యస్‌బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.  జపాన్‌ నికాయ్‌, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  సూచీలు స్వల్పలాభాల్లోనూ, చైనా షాంఘై, కొరియా కోస్పి ఇండెక్స్‌లు స్వల్ప నష్టాల్లోనూ ట్రేడవుతున్నాయి. 



You may be interested

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 22nd May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సింటెక్స్‌ ప్లాస్టిక్‌: తన అనుబంధ సంస్థ సింటెక్స్‌ -  బీఏపీఎల్‌ కంపెనీ అటో విభాగాన్ని విక్రయించేందుకు ఆమోదం తెలిపింది.  ఎడెల్వీజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- తన అనుబంధ సంస్థ ఎడెల్వీజ్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ కంపెనీలో ఆర్థర్‌ జే. గల్లఘేర్ & కో. మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది.   ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘకాలిక రేటింగ్‌ ‘‘ఎఎ’’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.  ఇన్ఫోసిస్‌

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు డౌన్‌

Wednesday 22nd May 2019

ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా భారత్‌ మార్కెట్‌ బుధవారం నెగిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు 32  పాయింట్ల నష్టంతో 11,837 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,869  పాయింట్ల వద్ద ముగిసింది.  తాజాగా ఆసియా మార్కెట్లలో  జపాన్‌ నికాయ్‌ మినహా సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌  చైనా షాంఘై, కొరియా కోస్పి

Most from this category