News


పాజిటివ్‌ ఓపెనింగ్‌

Wednesday 7th August 2019
Markets_main1565149944.png-27586

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నప్పటికీ, రిజర్వుబ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో  బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్పలాభంతో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 48 పాయింట్ల లాభంతో 37,025 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల పెరుగుదలతో 11,058 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో యస్‌బ్యాంక్‌, జీ టెలి, పవర్‌గ్రిడ్‌, విప్రోలు 1-3 శాతం మధ్య లాభాలతో మొదలుకాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 5 శాతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యింది.  టైటాన్‌, టాటా స్టీల్‌, అదాని పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1-2 శాతం మధ్య క్షీణించాయి. 



You may be interested

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 7th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ఏవియేషన్‌ ఫ్యూయల్‌ విక్రయంతో పాటు, దేశవ్యాప్తంగా మరిన్ని పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసేందుకు బ్రిటన్‌కు చెందిన బీపీ లిమిటెడ్‌తో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాయింట్‌ వెంచర్‌లో రిలయన్స్‌ వాటా 51శాతం గానూ, బీపీ లిమిటెడ్‌ వాటా 49శాతంగానూ ఉంటుంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఎన్‌సీడీల ద్వారా రూ.25వేల కోట్లను, రుణాల ద్వారా రూ.1000 కోట్లను సమీకరించేందుకు

71 కి చేరువలో రూపీ

Wednesday 7th August 2019

రూపీ డాలర్‌ మారకంలో బుధవారం(అగష్టు 7) 15 పైసలు బలహీనపడి 70.96 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బిఐ ద్రవ్యపరపతి సమావేశం ఈ రోజు జరగనుండడంతో పాటు, విదేశి నిధుల ఔట్‌ ఫ్లో కొనసాగుతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 8 పైసలు బలహీనపడి 70.81 వద్ద ముగిసింది. దీంతో గత వరుస నాలుగు సెషన్‌ల నుంచి రూపీ డాలర్‌ మారకంలో పడిపోయినట్టయ్యింది. మొత్తం మీద ఈ నాలుగు సెషన్‌లలో రూపీ డాలర్‌

Most from this category