News


దీర్ఘకాలానికి బుల్లిష్‌!

Tuesday 7th January 2020
Markets_main1578374860.png-30727

మార్కెట్‌పై మొబియస్‌
భారత ఈక్విటీలపై పాజిటివ్‌గా ఉన్నానని, దీర్ఘకాలానికి దేశీయ మార్కెట్లు బుల్లిష్‌గానే ఉంటాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌మొబియస్‌ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణమన్నారు. భారత మార్కెట్లో అవకాశం వచ్చినప్పుడల్లా పొజిషన్లు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టడం పాజిటివ్‌ చర్యని, ఇదే సమయంలో ప్రభుత్వం ఇన్‌ఫ్రా వ్యయాలపై దృష్టి ఎక్కువగా పెట్టాలని సూచించారు. ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెంచితే ప్రజలకు పని దొరుకుతుందన్నారు. బడ్జెట్లో ఇన్‌ఫ్రాకు ఎక్కువ కేటాయింపులుండవచ్చని ఆయన అంచనా వేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలే కీలకమని ఆయన చెప్పారు. వీటిలో స్థిరమైన పెరుగుదల వస్తే చమురు దిగుమతి దేశాలకు సమస్యన్నారు. దేశీయ ఈక్విటీలు సైతం చమురు ధరను నిశితంగా పరిశీలిస్తుంటాయన్నారు. ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధర మరింత పెరగవచ్చని మొబియస్‌ చెప్పారు. ఇరాన్‌ తీవ్రంగా స్పందించాలనుకుంటోందని, కానీ యూఎస్‌ వెనక్కుతగ్గకపోవచ్చని చెప్పారు. యూఎస్‌ఏ ప్రపంచంలో పెద్ద చమురు ఉత్పత్తిదారుగా అవతరించిందని, కానీ ప్రస్తుత పరిస్థితి ఇరాన్‌, ఇరాక్‌లో ఉత్పత్తిని దెబ్బతీస్తుందని చెప్పారు. ఈ రెండు దేశాల నుంచి పలు దేశాలకు చమురు సరఫరా అవుతున్న విషయం గుర్తు చేశారు. ఇవన్నీ తాజా ఉద్రిక్తతలతో అంతరాయానికి లోనవుతాయన్నారు. అందువల్ల చమురు ధరలో పెరుగుదల రావచ్చని అంచనా వేశారు. 



You may be interested

మళ్లీ షుగర్‌ షేర్ల దూకుడు

Tuesday 7th January 2020

దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాల్లో తగ్గిన చెరకు దిగుబడి, చక్కెర ఉత్పత్తి ఎఫెక్ట్‌ 52 వీక్‌ హై- బలరామ్‌పూర్‌, ఈఐడీ, ద్వారికేష్‌  ఇటీవల కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న చక్కెర తయారీ కంపెనీల కౌంటర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దాదాపు లిస్టెడ్‌ కంపెనీల షేర్లన్నీ లాభాలతో ట్రేడవుతున్నాయి. బలరామ్‌పూర్‌ చినీ, ద్వారికేష్‌ షుగర్‌, ఈఐడీ ప్యారీ తాజాగా 52 వారాల గరిష్టాలను తాకాయి. చెరకు దిగుబడి, చక్కెర

ఐటీఐ, మిధానీ, యాస్టర్‌ డీఎం- లాభాల్లో

Tuesday 7th January 2020

అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌చేయగా.. నిఫ్టీ 150 పాయింట్లు ఎగసింది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో టెలికం పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్‌, ఆరోగ్య పరిరక్షణ కంపెనీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌, ఇంజినీరింగ్‌ పీఎస్‌యూ మిశ్రధాతు నిగమ్‌(మిధానీ) చోటు సాధించాయి. వివరాలు చూద్దాం.. ఐటీఐ

Most from this category