News


ప్రభుత్వ చర్యలే .. 11,450 స్థాయికి తీసుకెళతాయి!

Saturday 10th August 2019
Markets_main1565433640.png-27688

ప్రభుత్వం తీసుకునే సానుకూల చర్యల వలన మార్కెట్‌ తిరిగి 11,450 స్థాయికి చేరుకోగలదని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

ప్రభుత్వ చర్యలు..అవసరం
ప్రస్తుతం మార్కెట్లను సానుకూలపరిచే అంశాలు  ఏమి లేవు. వాణిజ్య యుద్ధం, బలహీనమైన కరెన్సీ వంటి అంతర్జాతీయ కారకాలు మార్కెట్లను ఊహాగానాలపై నడిపించే అవకాశం ఉంది. ఎఫ్‌పిఐలపై సర్‌చార్జి పన్ను తగ్గుతుందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. ఇది జరుగుతుందో లేదో  అంచనా వేయడం కష్టమే. కానీ ఈ సర్‌చార్జీలను ప్రభుత్వం తగ్గిస్తే మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతాయి. గత రెండు నెలలో మార్కెట్‌ సూచీలు 10 శాతం మేర పతనమయ్యాయి. కనుక ఇప్పుడు మార్కెట్లు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. నిఫ్టీ 11,450 స్థాయిను చేరుకునే అవకాశం అధికంగా ఉం‍ది. ఈ స్థాయి వద్ద నిఫ్టీ ప్రతిఘటనను ఎదుర్కోవచ్చు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోడానికి సిద్ధమవ్వడంతో ఈ స్థాయిని నిఫ్టీ అందుకునే అవకాశం ఎక్కువ.

చర్యలేమైన స్వల్పకాలానికే..
ఎఫ్‌పిఐలపై పన్ను సర్‌చార్జీలను తొలగించడం,  సెప్టెంబర్ నుంచి పీఎస్‌యూ బ్యాంకుల రీకాపిటలైజేషన్ వంటి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే ఇలాంటి చర్యలేవైనా స్వల్ప కాలంలో మార్కెట్లలో కొనుగోలును పెంచుతాయి. ఫలితంగా మార్కెట్‌  తిరిగి 11,450 స్థాయికి చేరుకోగలదు. కానీ ఈ చర్యల వలన మార్కెట్‌ కొత్త గరిష్టాలను అధిగమించే అవకాశం కనిపించడంలేదు. అంతేకాకుండా  మధ్యస్థ కాలానికి గాను మార్కెట్‌ డౌన్‌ ట్రెండ్‌లోనే ఉంది. దీంతో పాటు యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వలన కరెన్సీ మార్కెట్లో తీవ్ర అస్థిరత ఏర్పడింది. దీని ఫలితంగా భారత రూపాయి మరింత క్షీణించి డాలర్‌కు రూ .70 నుంచి రూ .72 వరకు ఏకీకృతమయ్యే అవకాశం ఉంది.

‘బేర్‌’ ముగియలేదు..
మార్కెట్‌లో నెగెటివిటీ ఇంకా ఉంది. మార్కెట్ల నష్టాల పరంపర ముగియలేదని అనిపిస్తుంది. మార్కెట్లు తీవ్రంగా పడిపోయాయి కాబట్టి బౌన్స్ బ్యాక్ అయ్యే సమయం వచ్చింది. పతనం నుంచి కనీసం 50 శాతం బౌన్స్-బ్యాక్ అయ్యి, 11,450 స్థాయి వద్ద మార్కెట్‌ ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇన్వెస్టర్లు సెలెక్టివ్ క్వాలిటీ స్టాక్స్‌లో ప్రవేశించడానికి ఆసక్తి చూపించవచ్చు. ఆటో వంటి కొన్ని రంగాలలో మరింత స్పష్టత వచ్చేవరకు ఈ రంగ షేర్ల అమ్మకాలు కొనసాగే అవకాశం ఉంది.

కాశ్మీర్‌ ఇష్యు..మౌలిక రంగం
జమ్మూ-కాశ్మీర్‌ ఇష్యు వలన దేశంలో భూమి, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెరగవచ్చు. ఈ ప్రాంతంలో అధికంగా కార్యకలాపాలు జరిపే కంపెనీలు స్టాక్‌ మార్కెట్లలో ఎక్కువగా నమోదుకాకపోవడంతో ఈ సమస్య మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ రహదారులను నిర్మించడానికి, విస్తరించడానికి, ఆనకట్టలను నిర్మించడానికి ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలలో అధిక అవకాశాలున్నాయి. ఎన్‌బీసీసీ, ఎల్‌ అండ్‌ టీ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా మొదలైన కొన్ని కంపెనీలు వీటి వలన లాభపడవచ్చు.  

రిస్క్‌ ఫండ్స్‌, ఈక్విటీ ఫండ్స్‌కు సంబంధంలేదు..
క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి జూన్‌ నెలలో రూ. 2,695 కోట్ల ఔట్‌ ఫ్లో జరిగిందని ఏఎంఎఫ్‌ఐ విడుదల చేసిన డేటా పేర్కొంది. కాగా ఈక్విటీ ఫండ్స్‌లో జూలై నెలలో రూ 8,092 కోట్ల ఇన్‌ఫ్లో జరగింది. ఇది నెలవారీ ప్రాతిపదికన 6.7 శాతం పెరిగింది. ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధం ఉందని అనిపిస్తుం‍ది. కానీ ఈ రెండు విభాగాలు రెండూ వేర్వేరు వర్గాలకు చెందిన ఇన్వెస్టర్లను టార్గెట్‌గా చేసుకున్నాయి. ప్రస్తుతం క్రెడిట్ రిస్క్ ఫండ్లలలో రిస్క్‌, సాధరణ ఫండ్స్‌లో కంటే ఎక్కువని ఇన్వెస్టర్లు గ్రహించారు కనుక ఈ ఫండ్స్‌ నుంచి ఔట్‌ ఫ్లో సహజంగానే జరిగింది. అదే విధంగా ఈక్విటీ ఫండ్స్‌లో జరిగే ఔట్‌ ఫ్లో/ఇన్‌ఫ్లోకి, రిస్కు ఫండ్స్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈక్విటీ  వాతవరణమే దీనికి కారణమవుతుంది.You may be interested

ఇంకా అమ్మకాల మోడ్‌లో ఎఫ్‌పీఐలు?

Sunday 11th August 2019

దేశియ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ఔట్‌ ఫ్లో అగష్టు నెలలో కూడా భారీగా కొనసాగుతోంది. ఈ ఏడాది అగష్టు 1 నుంచి 9 వ తేదిల మధ్య, నికరంగా రూ.9,197 కోట్ల విదేశి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని డిపాజిటరీలు విడుదల చేసిన సమాచారం తెలుపుతోంది. కాగా విదేశి ఫోర్టుపోలియో ఇన్వెస్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే ఈ ధోరణి మారవచ్చని విశ్లేషకులు తెలిపారు. దేశియ అంతర్జాతీయ కారణాల

అవెన్యూ సూపర్‌మార్ట్‌లో ఒకశాతం వాటా విక్రయించిన దమానీ

Saturday 10th August 2019

డీ-మార్ట్‌ రిటైల్‌ మాల్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్‌ లిమిటెడ్‌ ప్రధాన ప్రమోటర్ల ఒకరైన రాధాకృష్ణ దమానీ 1శాతం వాటాను విక్రయించారు. ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో దమానీ ఆగస్ట్‌ 09న ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో 1శాతం వాటాకు సమానమైన మొత్తం 62.3లక్షల ఈక్విటీ షేర్లను ప్రతిషేరు ధర రూ.1,404.10 వద్ద రూ.561.64 కోట్లకు విక్రయించినట్లు బీఎస్‌ఈలో గణాంకాలు తెలియజేశాయి. అయితే, వాటాను కొనుగోలు చేసినవారి పేరు తెలియలేదు. పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నియమనిబంధనలకు

Most from this category