News


ఎఫ్‌అండ్‌ఓలో పాజిటివ్‌ సంకేతాలు!

Wednesday 3rd July 2019
Markets_main1562150002.png-26772

జూన్‌ సీరిస్‌లో సూచీలు పెద్దగా పెను మార్పులు లేకుండా ముగిశాయి. జూన్‌ సీరిస్‌ చివరి వారంలో ఎఫ్‌అండ్‌ఓలో కొంత కదలికలు కనిపించాయి. ఈ వారం ఆరంభం కూడా సూచీలు మందకొడిగా ప్రారంభించాయి. గతంలో జరిగనట్లే ఈ వారం కూడా సూచీలు దిగువకు రాగానే కొనుగోళ్లు కనిపించాయి. దీంతో నిఫ్టీ మరోమారు 11900 పాయింట్ల పైకి చేరింది. ఈ ర్యాలీలో కొత్తగా లాంగ్స్‌ ఏర్పడినట్లు ఫ్యూచర్స్‌ గణాంకాలు చూపుతున్నాయి. బడ్జెట్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పాజిటివ్‌ సెంటిమెంట్‌తో ఉండడం సూచీలకు కలిసివస్తోంది. రోలోవర్‌ డేటా సైతం పాజిటివ్‌ సంకేతాలనే ఇస్తోంది. నిఫ్టీలో దాదాపు 80 శాతానికి పైన రోలోవర్స్‌ జరగాయి. ఇది గత మూడు నెలల సరాసరి రోలోవర్లు 78 శాతం కన్నా ఎక్కువ. జూలై సీరిస్‌లో కొత్త లాంగ్స్‌ ఏర్పడడాన్ని ఇది సూచిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. గత సీరిస్‌ మొత్తం ఎఫ్‌ఐఐలు ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో షార్ట్‌ పొజిషన్లు ఎక్కువగా తీసుకున్నారు. దీనివల్ల జూన్‌ ఆరంభంలో లాంగ్‌ షార్ట్‌ నిష్పత్తి 60 నుంచి 53 శాతానికి పడిపోయింది. కానీ ఎఫ్‌ఐఐలు తమ బేరిష్‌ పొజిషన్లను జూలైలోకి మార్చుకున్నట్లు కనిపించలేదు. అందువల్లే జూలైలో లాంగ్‌ షార్ట్‌ నిష్పత్తి 62 శాతానికి ఎగబాకింది. బడ్జెట్‌ ముందు ఇలాంటి మార్పు ఇన్వెస్టర్లలో బడ్జెట్‌పై సానుకూలతకు నిదర్శనంగా కనిపిస్తోంది. మరోవైపు ఇండియా వీఐఎక్స్‌ సైతం 15 స్థాయిలకు పడిపోయి మార్కెట్‌లో బలాన్ని చూపుతోంది. ఇవన్నీ గమనిస్తే నిఫ్టీ బడ్జెట్‌ అనంతరం 11600 పాయింట్లను నిలబెట్టుకుంటే 12వేల పాయింట్ల పైవరకు ర్యాలీ ఉండవచ్చని నిపుణుల అంచనా. ట్రేడర్లు కచ్చితమైన స్టాప్‌లాస్‌తో లాంగ్స్‌ను కొనసాగించవచ్చని సూచన. 



You may be interested

ఈ స్టాక్స్‌లో రాబడుల ‘వర్షం’...!

Wednesday 3rd July 2019

ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు బడ్జెట్‌, రుతుపవనాల ప్రభావం, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం అంశాలపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి. ప్రధానంగా బడ్జెట్‌లో ప్రకటనలు, రుతుపవనాల విస్తరణ, వాటి ప్రభావం మార్కెట్ల గమనాన్ని స్వల్ప కాలానికి నిర్దేశిస్తాయని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రుతుపవనాలు, ప్రభుత్వ సానుకూల ప్రకటనలతో లాభపడే స్టాక్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు.    జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 33 శాతం వర్షపాతలోటు నెలకొంది. మధ్య భారతంలో అత్యధికంగా 43.9 శాతం

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 3rd July 2019

అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలకు తోడు ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 22 పాయింట్లు లాభపడి 39,839 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్పంగా లాభపడి11,916 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా మూడోరోజు లాభాల ముగింపు. ఇంట్రాడేలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్స్‌, రియల్టీ, మీడియా షేర్లకు కొనుగోళ్లు మద్దతు లభించింది. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌

Most from this category