News


స్పెన్సర్‌ రిటైల్‌లో వాటాల కొనుగోలు చేసిన పొరింజు

Tuesday 18th June 2019
Markets_main1560842371.png-26382

పొరింజు వెలియత్‌కు చెందిన ఈక్యూ ఇండియా ఫండ్‌ నాలుగు లక్షల స్పెన్సర్స్‌ రిటైల్‌ షేర్లను షేరుకు రూ. 94.53 చొప్పున కొనుగోలు చేసింది. దీంతో పాటు పలు బల్క్‌డీల్స్‌ మార్కెట్లో జరిగాయి. వాటి వివరాలు...

- సిల్కాన్‌ ట్రేడ్స్‌ ఎల్‌ఎల్‌పీ 96,000 ఫెలిక్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లను షేరుకు రూ.17.01 చొప్పున కొనుగోలు చేసింది.

- వైట్‌ ఐరిస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ 1,93,11,255 అపోలో టైర్స్‌ షేర్లను నిఫ్టీలో షేరుకు రూ.199.77 చొప్పున కొనుగోలు చేసింది. అదేవిధంగా 86 లక్షల షేర్లను బీఎస్‌ఈలో షేరుకు రూ.199.95 చొప్పున కొనుగోలు చేసింది.  

- శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ షేర్లను పిరమల్‌ ఎంటర్‌‍ప్రైజస్‌ జూన్‌ 17న విక్రయించగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచ్‌వల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచ్‌వల్‌ ఫండ్‌లు కొనుగోలు చేశాయి. ఎక్సెంజ్‌లో లభించిన సమాచారం మేరకు పిరమల​ఎంటర్‌ప్రైజస్‌ 2,26,00,000 షేర్లను షేరుకు రూ.1,000.73 చొప్పున విక్రయించగా,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ ద్వారా 29,00,557 షేర్లను , హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ 100 ఫండ్‌ ద్వారా 14,38,835 షేర్లను షేరుకు రూ.1000 చొప్పున హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచ్‌వల్‌ ఫండ్‌ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఎస్‌బీఐ మ్యూచ్‌వల్‌ ఫండ్‌ 36,13,096 షేర్లను, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ట్రస్టీ కో 19,19,576 షేర్లను షేరుకు రూ.1000 చొప్పున కొనుగోలు చేశాయి.



You may be interested

210 షేర్లు ఏడాది కనిష్టానికి ...

Tuesday 18th June 2019

మార్కెట్లో మిడ్‌సెషన్‌ సమయానికి ఆరంభలాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి స్థిరమైన ర్యాలీ దేశీయ మార్కెట్‌కు అండగా నిలుస్తున్నాయి. మధ్యాహ్నం గం.1:00ని.లకు సెన్సెక్స్‌ 185 పాయింట్లు పెరిగి 39,145.09 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లను ఆర్జించి 11,723.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌ రంగ

యశోవర్థన్‌ బిర్లా.. రుణ ఎగవేతదారు !

Tuesday 18th June 2019

ప్రకటించిన యూకో బ్యాంక్‌ న్యూఢిల్లీ: యశోవర్థన్‌ బిర్లాను రుణ ఎగవేతదారుగా యూకో బ్యాంక్‌ ప్రకటించింది. బిర్లా సూర్య లిమిటెడ్‌ కంపెనీ కోసం యశోవర్థన్‌ బిర్లా రూ.67.55 కోట్ల రుణం తీసుకున్నారని, ఎన్ని నోటీసులిచ్చినా, ఈ రుణం చెల్లించకపోవడంతో అతన్ని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తున్నామని యూకో బ్యాంక్‌ తెలిపింది. 2013లోనే ఈ రుణాన్ని మొండి బకాయిగా గుర్తించామని, అప్పటి నుంచి ఈ రుణాన్ని చెల్లించాల్సిందిగా పలు నోటీసులు పంపించామని, కానీ ఆయన స్పందించలేదని

Most from this category