STOCKS

News


పాలీకేబ్‌ ఐపీవో- 8 నెలల్లో 80 శాతం అప్‌

Monday 30th December 2019
Markets_main1577687063.png-30526

పబ్లిక్‌ ఇష్యూ విభాగంలో టాప్‌-5లో చోటు
టాప్‌ ర్యాంకర్స్‌- ఐఆర్‌సీటీసీ, ఇండియామార్ట్‌ 

ఈ ఏడాది(2019) చివరికల్లా దేశీ స్టాక్‌ మార్కెట్లు పలు ఒడిదొడుకుల మధ్య రికార్డు గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. మరోవైపు ఐపీవో మార్కెట్లోనూ కొంతమేర సందడి కనిపించింది. ఇష్యూలు తగ్గిన్పటికీ ఈ ఏడాది స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన కంపెనీలలో అత్యధికం ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం విశేషం! ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూలు చేపట్టిన కంపెనీలలో టాప్‌-5లో ఐఆర్‌సీటీసీ, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, అఫ్లే ఇండియా, పాలీకేబ్‌ ఇండియా, నియోజెన్‌ కెమికల్స్‌, మెట్రోహాస్పిటల్స్‌ను ప్రస్తావించవచ్చు. ఈ కౌంటర్లన్నీ ఐపీవో ధరలతో పోలిస్తే.. లిస్టింగ్‌ తదుపరి 100-50 శాతం స్థాయిలో దూసుకెళ్లడం గమనించదగ్గ అంశం! వివరాలు చూద్దాం...

పాలీకేబ్‌ ఇండియా
ఎఫ్‌పీఐల ఫేవరెట్‌
ఈపీసీ, ఎఫ్‌ఎంఈజీ విభాగా
ల దన్ను
ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ పాలీకేబ్‌ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్‌లో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడం‍ ద్వారా స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యింది. కంపెనీ షేరుకి రూ. 538 ధరలో ఐపీవోకి వచ్చింది. తదుపరి పటిష్ట ఫలితాలు సాధించడంతోపాటు.. విదేశాల నుంచి భారీ ఆర్డర్లను సంపాదిస్తుండటంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. సోమవారానికల్లా(30న) రూ. 981కు చేరింది. వెరసి గత 8 నెలల్లోనే ఈ షేరు ఏకంగా 82 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్టయ్యాక పాలీకేబ్‌ కౌంటర్‌ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. దీంతో డిసెంబర్‌ 5న ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 1092 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని సైతం తాకింది. ఇందుకు ప్రధానంగా ఎగుమతుల వాటా పుంజుకోవడం దోహదపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

విస్తరణపై దృష్టి
కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఒక ఆఫ్రికన్‌ కంపెనీ నుంచి రూ. 100 కోట్ల విలువైన ఆర్డర్‌ సంపాదించింది. మరోవైపు గత ఐదేళ్లలో రూ. 1200 కోట్ల పెట్టుబడులను వెచ్చించడం ద్వారా ఇతర విభాగాలోకి(డైవర్సిఫికేషన్‌) ప్రవేశించింది. తద్వారా ఈపీసీ, ఎలక్ట్రికల్‌ వినియోగ వస్తువుల (ఎఫ్‌ఎంఈజీ) బిజినెస్‌లలోకి విస్తరించింది. లెడ్‌ బల్బులు, ఫ్యాన్లు, తదితర ప్రొడక్టులను తయారు చేస్తోంది. ఈ బాటలో వచ్చే రెండేళ్లలో మరో రూ. 200 కోట్లు వెచ్చించడం ద్వారా వాటర్‌ హీటర్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అధిక మార్జిన్లుగల ఎఫ్‌ఎంఈజీ విక్రయాలు ఊపందుకోవడంతో ఇటీవల లాభదాయకతను సైతం పెంచుకుంటోంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

టాప్‌-5 ర్యాంకర్లు

కంపెనీ పేరు షేరు ధర(రూ.) లాభం(%)
   30-12-19      
ఐఆర్‌సీటీసీ 897  180
ఇండియామార్ట్‌ 2064  112 
అఫ్లే ఇండియా 1562  110 
పాలీకేబ్‌ 981 82
నియోజెన్‌ కెమ్‌ 355 65

 You may be interested

నష్టాల్లో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు

Monday 30th December 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు సోమవారం​ఉదయం సెషన్‌లో అమ్మకాల ఒత్తిడిలోనయ్యాయి. ఆర్‌బీఐ చేపట్టిన ఆపరేషన్‌ ట్విస్ట్‌ ప్రక్రియతో పాటు నిన్నటి వారంలో శనివారం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ బ్యాంకు అధికారులతో చర్చలు బ్యాంకింగ్‌ రంగ షేర్లపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.25శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,569.95 వద్ద

దేశీయంగా పసిడి స్వల్ప తగ్గుదల

Monday 30th December 2019

అయినా రూ.39వేల పైన ట్రేడింగ్‌ దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం ఉదయం పసిడి ఫ్యూచర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం కూడా పసిడికి ఫ్యూచర్ల ర్యాలీకి ప్రతికూలమైంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.39,067.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గతవారంలో కేవలం 4రోజుల ట్రేడింగ్‌ సెషన్లలోనే ఏకంగా రూ.1100లు ర్యాలీ చేసిన నేపథ్యంలో పసిడి ట్రేడర్లు

Most from this category