News


నష్టాల నుంచి లాభాల్లోకి పీఎన్‌బీ

Friday 26th July 2019
Markets_main1564139002.png-27342

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ జూన్‌ క్యార్టర్‌ ఫలితాలలో రూ. 1,018.63 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలానికి రూ.940 కోట్ల నికర నష్టాలను ప్రకటించిన ఈ బ్యాంకు, ఇప్పుడు లాభాల్లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కానీ కేటాయింపులు మాత్రం 65 శాతం(ఏడాది నుంచి ఏడాదికి) తగ్గిపోవడం గమనర్హం. జూన్‌ త్రైమాసికంలో రూ.350 కోట్ల నికర నష్టాలను ప్రకటిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. 
  వార్షిక ప్రాతిపదికన కేటాయింపులు  64.86 శాతం క్షీణించి రూ .5,758.16 కోట్లకు నుంచి రూ .2,023.31 కోట్లకు చేరుకున్నాయి. జూన్ 30 నాటికి బ్యాంక్ ప్రొవిజన్ కవరేజ్ నిష్పత్తి 74.63 శాతంగా ఉంది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పిఎ) 15.50 శాతం నుంచి 16.49 శాతానికి పెరగడంతో ఆస్తుల నాణ్యత క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో నికర ఎన్‌పిఎలు 6.56 శాతం ఉండగా ఈ త్రైమాసికంలో 7.17 శాతానికి పెరిగాయి.
    నికర వడ్డీ ఆదాయం 11.73 శాతం క్షీణించి రూ .4,141.36 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య రూ.4,691.86 కోట్లుగా ఉంది.  మొత్తంగా ఈ బ్యాంక్‌ స్థూల ఎన్‌పిఎలు రూ.82,888.79 కోట్ల నుంచి రూ.77,267.29 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో విద్యుత్, ఉక్కు రంగంలోని మోసపూరిత రుణాల విభాగంలో రూ.3,760.62 కోట్ల ప్రమేయం బ్యాంకుకు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదించింది. 
పీఎన్‌బీ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 3.18 శాతం పెరిగి రూ.68.15 వద్ద ముగిసింది. 

 


PNB

You may be interested

ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కే ఫండ్స్‌ మొగ్గు

Friday 26th July 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు జూన్‌ త్రైమాసికంలో లార్జ్‌క్యాప్‌లో ఐటీ స్టాక్స్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేశారు. అదే సమయంలో లార్జ్‌క్యాప్‌లోనే ఇంధన కంపెనీలకు మాత్రం దూరంగా ఉన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ చేసిన కొనుగోళ్లను పరిశీలిస్తే...    టీసీఎస్‌ షేరు మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎక్కువ నచ్చిన షేరుగా నిలిచింది. రూ.866 కోట్ల విలువైన షేర్లను ఫండ్స్‌ జూన్‌లో కొన్నట్టు మార్నింగ్‌ స్టార్‌ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. టీసీఎస్‌ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు,

ఆరురోజుల నష్టాలకు బ్రేక్‌

Friday 26th July 2019

కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ రాణించిన అటో, బ్యాంకింగ్‌ షేర్లు సూచీల ఆరురోజుల సుధీర్ఘ నష్టాల ముగింపునకు శుక్రవారం బ్రేక్‌ పడింది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 11,250ల పైన 11,284.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 52 పాయింట్లు లాభపడి 37,883 వద్ద స్థిరపడింది. నేటి నుంచి ఆగస్ట్‌ డెరివేటివ్స్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లకు ఆసక్తి చూపడంతో పాటు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకున్నారు. ఆరు రోజుల వరుస పతనం అనంతరం అధిక

Most from this category