News


భూషణ్‌ స్టీల్స్‌ ఫ్రాడ్‌: పీఎన్‌బీ 10శాతం క్రాష్‌

Monday 8th July 2019
Markets_main1562567080.png-26893

భూషణ్‌ స్టీల్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ రూ.3,800 కోట్ల మేర మోసానికి పాల్పడిందనే విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు 11.19 శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌లో పీఎన్‌బీ షేర్లు రూ.76.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అకౌంట్‌ బుక్‌లో అవకతవకలకు పాల్పడి కన్షారియం బ్యాంకుల నుంచి రుణాలు పొందిన భూషణ్‌ స్టీల్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీ రుణాలను పక్కదారి మళ్లించినట్లు పీఎన్‌బీ ఆరోపించింది. మాకు అందిన సమాచారం ప్రకారం భూషణ్‌ స్టీల్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీపై ఫోర్సెనిక్‌ ఆడిట్‌ విచారణ చేపట్టాం. కంపెనీలో జరిగిన అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేశాం. దర్యాప్తు సంస్థ కేసును సుమోటాగా తీసుకుని డైరెక్టర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ తెలిపాము’’ అని పీన్‌బీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే నీరవ్‌ మోదీ మోసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పీఎన్‌బీకు తాజాగా భూషణ్‌ స్టీల్‌ సంస్థ కుంభకోణం వెలుగులోకి రావడంతో ఈ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో ఒక దశలో 11.19 శాతం క్షీణించి రూ.72.60ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.81.75)తో పోలిస్తే 10.50శాతం నష్టంతో రూ.73.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.  58.65  రూ.99.90లుగా నమోదయ్యాయి. 



You may be interested

11425 పాయింట్ల వరకు పతనం!

Monday 8th July 2019

నిఫ్టీపై నిపుణుల అంచనా బడ్జెట్‌ రోజు నిఫ్టీ చార్టుల్లో ట్రెండ్‌రివర్సల్‌ జరిగిందని టెక్నికల్‌ నిపుణులు విశ్లేషించారు. నిఫ్టీ తన గత గరిష్ఠం 12100 పాయిం‍ట్లను దాటలేక వెనక్కు మరలింది. ఈ తరహా వెనకంజ మార్కెట్‌కు నెగిటివ్‌ పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు. మార్కెట్‌ వర్గాల అసంతృప్తికి ఇది నిదర్శనమని, రాబోయేరోజుల్లో మార్కెట్లో మరింత డామేజి జరుగుతుందని తెలిపారు. నిఫ్టీ క్రమంగా 11590 పాయింట్ల వరకు ఆపైన 11425 పాయింట్ల వరకు పతనమైతుందని అంచనా

దీపావళి వరకు మెరుపుల్లేవు!

Monday 8th July 2019

మార్కెట్‌పై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ అనంతరం నిట్టనిలువునా పతనమైతున్నాయి. ఈ పతనం మరికొన్ని నెలలు కొనసాగవచ్చని, బడ్జెట్లో ఎకానమీ రికవరీపై స్పష్టత లేకపోవడం మార్కెట్‌కు నచ్చలేదని, మరోవైపు కన్జూమర్‌ సెంటిమెంట్‌ వేగంగా క్షీణిస్తోందని ఒక సర్వేలో పాల్గొన్న మార్కెట్‌వర్గాలు అభిప్రాయపడ్డాయి. కనీస పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనల్లో రాబోయే మార్పు మరికొన్నాళ్లు కంపెనీలను ఇబ్బంది పెడుతుందని అంచనా వేశారు. ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రకటించిన సాయం పెద్దగా సరిపోదని, ఈ రంగంలో

Most from this category