STOCKS

News


ప్రధాని ప్రకటనలు... ఈ రంగాలపై ప్రభావం!

Friday 16th August 2019
Markets_main1565893979.png-27794

ప్రధాని నరేంద్రమోదీ 73వ స్వాతంత్ర్యదినం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశాభివృద్ధి, ఆర్థిక రంగం, వ్యాపార, పర్యాటకం, రక్షణ, పర్యావరణం, ఆరోగ్యం ఇలా ఎన్నో రంగాలను స్పృశించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధం ఇందులో కీలకమైనది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలన్నది ప్రధాని ప్రకటన సారాంశం. అలాగే, రసాయన ఎరువుల వినియోగ వాడకాన్ని రైతులు ఆపేయాలని కూడా ప్రధాని కోరారు. విదేశాల్లోని అందాలు చూడడానికి బదులు... దేశంలోనే ఉన్న సుందర పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు మొగ్గు చూపాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ పలు కీలక రంగాల స్టాక్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ప్రధాని ప్రసంగం ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుందని ఐఐఎఫ్‌ఎల్‌ సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. 

 

  • ఒక్కసారి మాత్రమే వినియోగానికి వీలైన ప్లాస్టిక్‌ను దేశవ్యాప్తంగా నిషేధించడం పేపర్‌ పరిశ్రమకు (పేపర్‌ స్టాక్స్‌) సానుకూలం. ప్లాస్టిక్‌ స్థానంలో పేపర్‌ బ్యాగుల విక్రయాలకు అవకాశం ఉంటుందన్నది నిపుణులు అంచనా. 
  • దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటికీ పైపుల ద్వారా సురక్షిత నీటిని రూ.3.5 లక్షల కోట్ల వ్యయంతో అందించే జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రధాని ప్రకటించారు. ఇది వీఏ టెక్‌ వాబాగ్‌, ఆస్ట్రల్‌ పాలీ, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్స్‌మో పైప్స్‌ తదితర స్టాక్స్‌కు సానుకూలం. పైప్‌, వాటర్‌ ఫిల్టర్‌, సిమెంట్‌ రంగాలకూ కూడా సానుకూలమేనని టార్గెట్‌ ఇన్వెస్టింగ్‌ వ్యవస్థాపకుడు సమీర్‌కల్రా తెలిపారు. 
  • వ్యాపార సులభ దేశాల సూచీలో టాప్‌-50లోకి రావాలన్నది లక్ష్యం. 
  • అత్యాధునిక మౌలిక సదుపాయాల కోసం రూ.100 లక్షల కోట్లను కేంద్ర ఖర్చు చేయనుండడం, మౌలిక రంగ కంపెనీలు ఎల్‌అండ్‌టీ, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, అశోకా బిల్డ్‌కాన్‌, టెక్స్‌మాకో రైల్‌, టైటాగఢ్‌ వ్యాగన్స్‌, సిమ్కో తదితర కంపెనీలకు అనుకూలిస్తుంది. 
  • ప్రజలు వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌, విమానాశ్రయాలు తమ పట్టణాలకూ రావాలని కోరుకుంటున్నారని ప్రధాని ప్రకటించారు. స్పైస్‌జెట్‌, ఇంటర్‌గ్లోబ్‌ వంటి స్టాక్స్‌కు సానుకూలం.
  • గతంలో ప్రజలు మొబైల్‌ ఫోన్లు ఉండాలనుకుంటే, నేడు మెరుగైన డేటా స్పీడ్‌ ఆశిస్తున్నారని ప్రకటించారు. టెలికం కంపెనీలైన రిలయన్స్‌ జియో(ఆర్‌ఐఎల్‌), ఎయిర్‌టెల్‌, వొడాఐడియాలకు సానుకూలం. 
  • 2022 నాటికి దేశ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు దేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాలను చూసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 100 పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి కూడా పులుపునిచ్చారు. కనుక పర్యాటక రంగంలోని కంపెనీలకు, హోటల్స్‌కు సానుకూలం. 
  • రసాయన ఎరువుల వినియోగాన్ని ఆపేయాలని కోరారు. కనుక ఎరువుల కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Friday 16th August 2019

 స్వాతంత్రదినం సెలవు తర్వాత శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో పునర్‌ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా క్షీణతతో 37,100 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్లకుపైగా తగ్గుదలతో 10,960 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. బుధవారం రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు భారీగా పతనమైన ప్రభావం ఈ ఉదయం ఇక్కడి ట్రేడింగ్‌పై పడింది. యస్‌బ్యాంక్‌, యూపీఎల్‌, సిప్లా, కోల్‌ ఇండియాలు స్వల్పలాభాలతో మొదలుకాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో

మీ చిన్నారుల భవిష్యత్తుకు ‘సిప్‌’

Friday 16th August 2019

తల్లిదండ్రులకు తమ పిల్లల విషయంలో ఎన్నో ఆనందాలు ఉంటుంటాయి. అదే సమయంలో బోలెడన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కేవలం వారి ప్రస్తుత అవసరాలను చూడడమే కాకుండా, వారి భవిష్యత్తుకు తగిన ప్రణాళికలు కూడా రెడీ చేసుకోవాలి. ద్రవ్యోల్బణ పరిస్థితులు, భవిష్యత్తులో విద్య పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూలు ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, రవాణా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను ఎంతగానో ప్రభావితం చేస్తాయనడం

Most from this category