STOCKS

News


త్వరలో మరిన్ని పన్ను తగ్గింపులు?!

Tuesday 29th October 2019
Markets_main1572346451.png-29212

ఇన్వెస్టర్లను ఆకట్టుకునే దిశగా ప్రభుత్వ యోచన
ఈక్విటీ పెట్టుబడులపై అమలవుతున్న పలు పన్నులను సరళీకరించేదిశగా ప్రభుత్వం త్వరలో చర్యలు ప్రకటించనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను పెంపొందించి, మరిన్ని విదేశీ నిధులను దేశంలోకి ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈక్విటీ పన్నురేట్ల సంస్కరణలు తీసుకురానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌కు సంబంధించిన కీలక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతమున్న దీర్ఘకాలిక మూలధన పన్ను(ఎల్‌టీసీజీ), సెక్యూరిటీ లావాదేవీ పన్ను(ఎస్‌టీటీ), డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీటీటీ)లను ప్రధాని కార్యాలయం సమీక్షిస్తోందని, ఇందుకు ఆర్థిక శాఖ, నీతిఆయోగ్‌ సహకారాలు అందిస్తున్నాయని చెప్పారు. బడ్జెట్‌కు ముందే వీటిని ప్రకటించవచ్చని, కాదంటే బడ్జెట్లో ప్రకటించవచ్చని తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న కొత్త బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నవంబర్‌ చివరినాటికి పన్ను విషయాలను సమీక్షించేందుకు ఏర్పాటైన అధికారుల బృందం నివేదిక సమర్పించగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో ఉన్న పలు రకాల పన్నులను తీసివేసి ఏకీకృత పన్ను తీసుకురావచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. ఈక్విటీలతో పాటు డెట్‌, కమోడిటీ మార్కెట్లపై పన్నులను కూడా ప్రభుత్వం సమీక్షించనుంది. 
ఏ పన్ను ఎంతెంత?

ఎల్‌టీసీజీ- ఏడాది దాటిన లక్ష రూపాయలపై బడిన ఆదాయార్జనపై విధిస్తారు. 10 శాతం.
ఎస్‌టీజీసీ- ఏడాదిలోపు ఈక్విటీ ఆదాయాలపై విధిస్తారు. 15 శాతం.
డీడీటీ- కంపెనీలు చెల్లించే డివిడెండ్లపై విధిస్తారు. 15 శాతం.
ఎస్‌టీటీ- ఈక్విటీ లావాదేవీలపై విధిస్తారు. డెలివరీ జరిగిన వాటిపై 0.1 శాతం, ఆప్షన్స్‌పై 0.05 శాతం, ఫ్యూచర్స్‌పై 0.01 శాతం. 


విదేశీ పెన్షన్‌ ఫండ్స్‌ ఇండియా మార్కెట్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా డీడీటీ అడ్డుగా ఉంటోందని పలువురు నిపుణులు ఎప్పటి నుంచో విశ్లేషిస్తున్నారు. ప్రత్యక్ష పన్నులపై ఏర్పాటైన కమిటీ కూడా డీడీటీ ఎత్తివేయాలని గతంలోనే సిఫార్సు చేసింది. ఎల్‌సీజీటీని ఇన్వెస్టర్లు ఈక్విటీలపై ఆర్జించిన మొత్తం లక్ష రూపాయలు దాటి, కాలపరిమితి ఏడాది దాటితే వసూలు చేస్తారు. ఒకవేళ ఏడాది దాటకుంటే ఎస్‌టీసీజీ వసూలు చేస్తారు. కంపెనీలు చెల్లించిన డివిడెండ్‌పై 15 శాతం పన్ను కడుతుంటాయి. ఇవన్నీ ఇన్వెస్టర్లు ఈక్విటీలకు దూరంగా ఉండేందుకు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం వీటన్నింటినీ సమీక్షించి ఒకే పన్ను విధానం తీసుకురావాలన్నది ప్రభుత్వ యోచన. కొత్త ప్రతిపాదనలు బడ్జెట్లో ప్రకటించాలని ఆర్థిక శాఖ భావిస్తుండగా, సమీక్షలు పూర్తయితే బడ్జెట్‌ కన్నా ముందే ప్రకటించాలని పీఎంఓ ఒత్తిడి చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం మీద త్వరలో మార్కెట్‌ ఇన్వెస్టర్లపై పన్ను భారం తగ్గడమైతే ఖాయంగా కనిపిస్తోంది. You may be interested

ఐదు కంపెనీల్లో వాటాలు పెంచుకున్న కచోలియా

Wednesday 30th October 2019

ప్రముఖ సీనియర్‌ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కచోలియా సెప్టెంబర్‌ త్రైమాసికంలో తన పోర్ట్‌ఫోలియో పరంగా పలు మార్పులు, చేర్పులు చేశారు. ముఖ్యంగా ఐదు కంపెనీల్లో ఆయన వాటాలు పెంచుకున్నట్టు డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో దాగి ఉన్న ఆణిముత్యాల్లాంటి షేర్లను గుర్తించడంలో కచోలియాకు మంచి పేరుంది. కనుక ఆయన పోర్ట్‌ఫోలియోను గమనించడం ద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడికి సంబంధించి కొన్ని సంకేతాలను అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.    మాజెస్కో, కేపీఐటీ

రిలయన్స్‌, టాటామోటర్స్‌, పీఎస్‌యూ స్టాకులపై పాజిటివ్‌

Tuesday 29th October 2019

-హెమాంగ్‌ జాని, షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ‘గతంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుం‍చి డీమెర్జర్‌ జరిగిన తర్వాత స్టాక్‌ హోల్డర్లకు మంచి లాభాల్ని పొందారని, ఇప్పుడు కూడా రిలయన్స్‌ జియో డీమెర్జ్‌ మార్కెట్‌ వర్గాలను ఆకర్షిస్తోందని, ఈ కంపెనీ షేరు రీరేట్‌ అవుతుంది’ అని షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జాని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో.. ఆటో రంగం పుంజుకుంటోంది.. ఒకే రంగంలోని అధ్వాన్న ప్రదర్శన చేస్తున్న కంపెనీలు అంచనాల కంటే

Most from this category