News


బడ్జెట్‌ నేపథ్యంలో క్యాలెండర్‌ కాల్‌ వ్యూహం బెటర్‌!

Thursday 27th June 2019
Markets_main1561618488.png-26611

 నిపుణుల సలహా
బడ్జెట్‌ వారం వీక్లీ నిఫ్టీ ఆప్షన్లలో క్యాలెండర్‌ కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించడం ద్వారా మంచి రాబడి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యూహంలో కొంచెం దూరం స్రై‍్టక్‌ప్రైస్‌లోని రెండు కాల్స్‌ను విక్రయించి వాటి దిగువ స్ట్రైక్‌ ప్రైస్‌కు చెందిన మరసటి వారం కాల్‌ను కొనుగోలు చేయడం జరుగుతుంది. బడ్జెట్‌ వేళ ఇది మంచి వ్యూహమని, బడ్జెట్‌కు ముందు నిఫ్టీ 12150 పాయింట్లను దాటదన్న అంచనాతో ఈ వ్యూహాన్ని అవలంబించవచ్చని క్రాస్‌సీస్‌ క్యాపిటల్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ బహెతి చెప్పారు. మార్కెట్లు 2.5 శాతానికి మించి పెరగవన్న అంచనాతో  ఈ వ్యూహం అవలంబించవచ్చని, ఒకవేళ నిఫ్టీ 12150 పాయింట్లు దాటితే రిస్కు పెరుగుతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 
వ్యూహం అమలు..(బుధవారం ధరల ప్రకారం)
 నిఫ్టీ జూలై 4 ఎక్స్‌పైరీ అయ్యే 12100 కాల్‌ లాట్స్‌ రెండిటిని విక్రయించాలి. ఇందుకు ఒక్కో ఆప్షన్‌కు 40 రూపాయలు అవుతుంది(ఒక లాట్‌లో 75 ఆప్షన్లుంటాయి). ఇదే సమయంలో జూలై 11న ఎక్స్‌పైరీ అయ్యే 12000 కాల్‌ను కొనుగోలు చేయాలి. ఇందుకు ఒక్కో ఆప్షన్‌కు రూ.90 పడుతుంది. వ్యూహం అమలుకు ట్రేడర్‌కు పడే మొత్తం రూ.50 పడుతుంది(90- 40). నిఫ్టీ జూలై4కు ముందు 12150కి దిగువన క్లోజయితే ట్రేడర్‌కు విక్రయించిన కాల్‌లో మొత్తం ప్రీమియం వస్తుంది. తదుపరి వారం కాల్‌ కొనుగోలు చేసి ఉన్నందున నిఫ్టీ తదుపరి వారం 12000 పాయింట్లకు ఎంత పైన ముగిస్తే అంతచొప్పున కొన్న కాల్‌కు లాభం వస్తుంది. 
ఒకవేళ మార్కెట్‌ జూలై 4కు లోపు భారీ ర్యాలీ జరిపి 12150 పాయింట్లను దాటితే రిస్కుఉంటుంది. అందువల్ల ఈ స్థాయిని వ్యూహానికి స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలి. ఈ స్థాయి వద్ద ట్రేడర్‌కు ఎలాంటి లాభం, నష్టం ఉండవు. ఈ స్థాయిని దాటిఏ అమ్మిన కాల్స్‌లో నష్టం పెరుగుతూ పోతుంది. కొన్న కాల్‌లో వచ్చే లాభం అమ్మిన కాల్స్‌ నష్టాన్ని పూడ్చలేకపోతుంది. అందువల్ల కచ్ఛితంగా ఈ స్థాయిని స్టాప్‌లాస్‌గా పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 


పైవన్నీ మార్కెట్‌ నిపుణుల సలహాలు మాత్రమే, సొంత పెట్టుబడులకు ముందు స్వీయ అధ్యయనం తప్పనిసరి. You may be interested

ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీపై జీ- 20 దేశాల దృష్టి

Thursday 27th June 2019

లండన్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా కాయిన్‌పై శక్తిమంతమైన జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో ఫేస్‌బుక్ అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఫేస్‌బుక్ ప్రాజెక్టు లక్ష్యాలు భారీగానే ఉన్నాయని, అయితే నిబంధనలకు లోబడే అది

రికార్డు గరిష్టానికి ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Thursday 27th June 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజ కంపెనీలైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు గురువారం తమ కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. నేడు మార్కెట్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న మద్దతులో భాగంగా ఈ రెండు షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.2,468.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ను ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లకు మొగ్గుచూపడంతో 0.81శాతం లాభపడి రూ.2488.00ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని

Most from this category