ప్రస్తుత పరిస్థితిని కొనుగోలుకు వాడుకోండి: సంజివ్ భాసిన్
By Sakshi

‘బడ్జెట్‌ను అర్థం చేసుకోడానికి మార్కెట్లకు ఇంకో వారం రోజులు పడుతుంది. ఈ సమయాన్ని కొనుగోలుకు వినియోగించుకోవాలి’ అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఎక్స్యూకుటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజివ్ భాసిన్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే... మార్కెట్లు అతిగా స్పందించాయి.. ఐటీ కన్నా ఫార్మా మిన్న
పబ్లిక్ షేర్ హోల్డింగ్ కనీస పరిమితిని బడ్జెట్లో 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడంతో స్టాక్ మార్కెట్లో షేర్ సప్లై పెరగనుండడంతో పాటు ఇందన ద్రవ్యోల్బణంలో అసంతృప్తి, సంపన్నులపై పన్నుల పెంపు వలన మార్కెట్లు నష్టపోయాయి. అంతేకాకుండా అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు పెరగడంతో అంతర్జాతీయంగా ఈల్డ్‌లు పెరిగాయి. డాలర్ బలపడడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో దేశియ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. బడ్జెట్ మరీ నెగిటివ్‌గా లేదు కానీ సానుకూలతలు తెలియడానికి సమయం పడుతుంది. బడ్జెట్లో అద్భుతాలు చేసే అంశాలు కూడా ఉన్నాయి కానీ మార్కెట్లు అతిగా స్పందించాయని అనిపిస్తోంది. ప్రభుత్వం కూడా అంచానాలను అందుకోడానికి ప్రయత్నించింది. నిరాశవాదం, అంతర్జాతీయంగా అమ్మకాలు పరిమితులను మించాయి. 11,600 బలమైన మధ్ధతు స్థాయిగా పనిచేయగలదు. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ స్థాయి వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. బడ్జెట్‌ను పూర్తిగా మార్కెట్ అర్థం చేసుకోడానికి ఇంకో వారం రోజుల సమయం పట్టవచ్చు. ఈ పరిస్థితిని కొనుగోలుకు ఉపయోగించుకోవడం ఉత్తమం.
ఫైనాన్సియల్, మిడ్ క్యాప్, ఆటో
ఫైనాన్సియల్ సెక్టార్ సంతృప్తికరంగా ఉంది. ఆర్బీఐ తీసుకునే తదుపరి చర్యలకై కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు , ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్బీఐ రేట్ల కోత ఉండే అవకాశం ఉంది. ఈ రేట్ల కోత ఫలితాలను చివరి వినియోగదారుడికి ఏ విధంగా బదిలీ అవుతుందో గమనించాలి. ఫైనాన్సియల్ రంగంపై సానుకూలంగా ఉన్నాం. నాణ్యమైన కార్పోరేట్ బ్యాంకులు, కొన్ని పీఎస్‌యూలు, ఎన్బీఎఫ్సీలను పరిశీలించవచ్చు. ఈ రంగతో పాటు కొన్ని సెలక్ట్ మిడ్‌క్యాప్‌లు బాగా ప్రదర్శన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లిక్విడిటీ సమస్య తగ్గుముఖం పడుతోంది. అంతేకాకుండా కార్పోరేట్ సంపాదనలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం వీటి ప్రదర్శన అధ్వాన్నంగా ఉన్నప్పటికి అక్టోబర్ త్రైమాసికం నుంచి వచ్చే 18 నెలల వరకు వీటి అసలైన ప్రదర్శనను గమనించవచ్చు.
వాహాన తయారి, అనుబంధ రంగం గత 10 ఏళ్ల నుంచి సంపదను సృస్టిస్తున్న అతి పెద్ద నాలుగోవ సెక్టార్‌గా ఉంది. ప్రస్తుతం ఆటో రంగ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్-4 నుంచి బీఎస్ 6 వైపు మరలతుండడం, ఇన్సురెన్స్ నింబంధనలు వంటివి ఈ రంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇన్పుట్ ఖర్చులు తగ్గి ఈ త్రైమాసికం నుంచి సంపాదన, పరిమాణం, లాభాలు ఆశ్చర్యకరంగా పెరుగుతాయని అనుకుంటున్నాం.
టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలున్నప్పటికి ప్రస్తుతం ఐటీలో పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలంగా లేదు. కంపెనీల బై బ్యాక్‌లపై పన్ను విధించడం, రూపీ బలపడుతుండడంతో ఐటీ సమస్యలను ఎదుర్కొంటుంది. ఐటీ కన్నా ఫార్మా రంగం మంచిగా కనిపిస్తోంది. ఈ రంగం వాల్యుషన్లు సంతృప్తికరంగా ఉన్నాయి.
You may be interested
రికవరి బాటలో బ్యాంకు నిఫ్టీ
Tuesday 9th July 2019మార్కెట్ రికవరిలో భాగంగా మిడ్‌సెషన్ సమయానికి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ తిరిగి కోలుకుంది. ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ నేడు 11,531.60ల స్థాయి వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం సెషన్లో మార్కెట్ పతనంలో భాగంగా దాదాపు 1శాతం క్షీణించి 30346.70 స్థాయికి పతనమైంది. అనంతరం మార్కెట్లో జరిగిన షార్ట్ కవరింగ్‌లో భాగంగా ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీతో ఇండెక్స్ ఇంట్రాడే కనిష్టస్థాయి(30346.70)
మైండ్‌ట్రీ ప్రత్యేక సంస్థగానే కొనసాగుతుంది
Tuesday 9th July 2019ఎల్అండ్టీ సీఈవో సుబ్రహ్మణ్యన్ వెల్లడి న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటికీ దాన్ని విడిగానే కొనసాగించనున్నట్లు ఇన్ఫ్రా దిగ్గజం ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. గ్రూప్‌లో భాగమైన ఐటీ సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్‌ట్రీ కార్యకలాపాలు వేర్వేరుగానే ఉన్నాయని ఆయన వివరించారు. మైండ్‌ట్రీ సిబ్బంది విషయంలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు, చేర్పులు చేసే యోచనేదీ లేదని ఆయన చెప్పారు. కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగుతాయని, రాబోయే