News


సన్‌ఫార్మా 5శాతం అప్‌

Tuesday 9th July 2019
Markets_main1562667339.png-26929

ఫార్మా షేర్ల ర్యాలీలో భాగంగా మంగళవారం సన్‌ షేర్లు 5.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.370.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషధ పరిశ్రమలో 11-13శాతం వృద్థిని నమోదుచేయవచ్చనే ఇక్రా తన వార్షిక నివేదికలో వెల్లడించడంతో నేటి ట్రేడింగ్‌లో ఫార్మా రంగ షేర్లకు ర్యాలీ జరిగింది. అందులో భాగంగా ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో ఒక దశలో 7.50శాతం పెరిగి రూ.394.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన సన్‌ఫార్మా షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ దాదాపు 3శాతం పెరిగింది. మార్కెట్‌ ముగింపు సమయానికి 5.50శాతం లాభపడి రూ.386.70ల వద్ద స్థిరపడింది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.350.40  రూ.678.80లుగా నమోదయ్యాయి.



You may be interested

ఈ రంగాలు బలహీనం!

Tuesday 9th July 2019

క్యు1 ఫలితాలపై సిటీ గ్రూప్‌ అంచనాలు పేలవ ఆటో విక్రయాలు, బలహీన మెటల్‌, ఎనర్జీ కంపెనీల ఫలితాలు.. తొలి త్రైమాసిక ఫలితాలను నీరుగారుస్తాయని సిటీ గ్రూప్‌ అంచనా వేస్తోంది. క్యు1లో బ్యాంకులు మంచి పనితీరు కనబరిచినా, ఆటో, మెటల్స్‌, ఎనర్జీ రంగాలు నిరాశపరుస్తాయని అభిప్రాయపడింది. తాము పర్యవేక్షించే 150 పైచిలుకు కంపెనీల ఉమ్మడి క్యు1 ఫలితాల ఎర్నింగ్స్‌ వృద్ధి గతేడాదితో పోలిస్తే 3 శాతం మాత్రమే అధికంగా ఉండొచ్చని పేర్కొంది. క్యు1లో

యస్‌బ్యాంక్‌ షేరు ర్యాలీకి రెడీగా ఉందా?

Tuesday 9th July 2019

మార్కెట్లో మూడు రోజులుగా జరుగుతున్న పతనంతో సంబంధం లేకుండా యస్‌ బ్యాంకు షేరు మాత్రం పాజిటివ్‌గా కదలాడుతోంది. మంగళవారం ఆరంభట్రేడింగ్‌లో దాదాపు 4 శాతం లాభపడిన యస్‌బ్యాంకు షేరు చివర్లో స్వల్ప నష్టంతో క్లోజయింది. తమ ఆర్థిక పరిస్థితి బలంగా, స్థిరంగా ఉందని సోమవారం బ్యాంకు ప్రకటించింది. లిక్విడిటీ, నిర్వహణా సామర్ధ్యం జోరు చూపుతూనే ఉన్నాయని తెలిపింది. దీంతో సోమవారం షేరు మంచి ర్యాలీ జరిపింది. గత కొన్ని నెలలుగా

Most from this category