News


ఫార్మా షేర్ల పతనం

Friday 27th September 2019
Markets_main1569577751.png-28590

ఫార్మా షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో పతనాన్ని చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. నేడు ఫార్మా ఇండెక్స్‌ 7,837.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(7857.30)తో పోలిస్తే 2శాతం నష్టపోయి 7,700.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 6.50శాతం క్షీణించింది. గ్లెన్‌మార్క్‌ 3.50శాతం, సన్‌ ఫార్మా 2.50శాతం, అరబిందో ఫార్మా, కేడిల్లా హెల్త్‌కేర్‌, లుపిన్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 1.50శాతం, దివీస్‌ ల్యాబ్స్‌ 1శాతం క్షీణించాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో బయోకాన్‌ షేర్లు 1శాతం లాభపడగా, సిప్లా షేర్లు అరశాతం పెరిగింది. 



You may be interested

నష్టాల ముగింపు

Friday 27th September 2019

మార్కెట్‌ లాభం ఒక్కరోజుకే పరిమితమైంది. సూచీలు శుక్రవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 167.17 పాయింట్లు నష్టపోయి 39000 దిగువున 38,822.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 59 పాయింట్లు కోల్పోయి 11500 స్థాయి కింద 11,512.40 వద్ద ముగిసింది. అన్నిరంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలమైన బ్యాంక్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 38,000 దిగువున 29,876.65 వద్ద

క్యూ4లో కార్పొరేట్‌ లాభాలు కొత్త గరిష్టానికి !

Friday 27th September 2019

‘ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో వ్యవస్థలో మూలధన వ్యయ చక్రం తిరిగి పుంజుకుంటుంది. దీంతో కంపెనీల లాభాల వృద్ధి పెరుగుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి సహాయపడుతుంది’ అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈఓ రాజీవ్‌ సింగ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. అతి పెద్ద సంస్కరణ.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్యను  1991 తర్వాత అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా చెప్పుకోవచ్చు. ముందు

Most from this category