News


ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 7th February 2020
Markets_main1581070659.png-31603

ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ వరుసగా మూడోరోజూ లాభంతో ముగిసింది. మార్కెట్‌ నష్టాల్లో ముగిసినప్పటికీ ఫార్మా రంగ షేర్లు లాభపడటం విశేషం. ఈ రంగంలో ప్రధాన షేర్లైన అరబిందో ఫార్మా, 6.50శాతం లాభపడింది. బయోకాన్‌ 5.50శాతం, దివీస్‌ ల్యాబ్స్‌ 3.30శాతం, గ్లెన్‌మార్క్‌ షేరు 2.50శాతం, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేరు 1.50శాతం, కేడిల్లా హెల్త్‌కేర్‌ 1శాతం, సిప్లా అరశాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు పావుశాతం పెరిగింది. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని లుపిన్‌ షేరు 2.50శాతం నష్టపోగా, సన్‌ఫార్మా షేరు​0.09శాతం నష్టంతో ముగిసింది. మార్కెట్‌ ముగిసే సరికి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 1.50శాతం లాభంతో ముగిసింది. 



You may be interested

ఐపీఓతో పాలసీ హోల్డర్లకు ప్రాబ్లమ్‌ లేదు: ఎల్‌ఐసీ

Friday 7th February 2020

ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఎల్‌ఐసీని పబ్లిక్‌ లిస్టింగ్‌కు తెచ్చే యత్నాలు ఆరంభమయ్యాయి. ఐపీఓకు సంబంధించి పనులు మొదలెడతామని, కానీ ఇందుకు నిర్ధిష్ట సమయం నిర్ధారించలేమని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. ఐపీఓతో పాలసీ హోల్డర్లపై, కంపెనీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కంపెనీ వాల్యూషన్‌పై ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. ఇంకా వాల్యూషన్ల మదింపు చేయలేదని తెలిపారు. రూ.

‘‘వాట్సాప్‌ పే’’కు లైన్‌క్లియర్‌

Friday 7th February 2020

ప్రపంచమంతా డిజిటల్‌ టెక్నాలజితో పరుగులు పెడుతోంది. దీంతో ఏ పనైనా సెకన్లు లేదా నిమిషాల్లో అయిపోతుంది.  ముఖ్యంగా ఏదైనా పేమెంట్‌ చేయాలంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది గూగుల్‌ పే, ఫోన్‌ పేలు. ఇప్పుడు వీటి సరసన ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌ చేరనుంది. గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ‘వాట్సాప్‌ పే’ సేవలు ఇండియాలో అందించడానికి లైన్‌క్లియర్‌ అయింది. ద నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ‘వాట్సాప్‌  పే’ సేవలను

Most from this category