News


ఫార్మా షేర్ల పతనం

Tuesday 25th February 2020
Markets_main1582623886.png-32080

మార్కెట్‌ పతనంలో భాగంగా మంగళవారం ఫార్మా షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2.60శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 8,153.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2.66శాతం నష్టాన్ని చవిచూసి 7898.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 3గంటలకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు(8,115.55)తో పోలిస్తే 2శాతం నష్టంతో 7,950.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేరు అత్యధికంగా 5శాతం నష్టాన్ని చవిచూసింది. బయోకాన్‌ 3.50శాతం, గ్లెన్‌మార్క్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 3శాతం, సన్‌ఫార్మా షేరు 2శాతం, దీవీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, క్యాడిల్లా హెల్త్‌కేర్‌ షేరు 1శాతం నష్టపోయాయి. లుపిన్‌, అరబిందో ఫార్మా షేరు అరశాతం క్షీణించాయి. 



You may be interested

రెలిగేర్‌ నుంచి టాప్‌ రికమండేషన్స్‌

Tuesday 25th February 2020

వచ్చే మూడు నాలుగువారాల్లో మంచి రాబడిని అందించే మూడు రికమండేషన్లను రెలిగేర్‌ బ్రోకరేజ్‌ అందిస్తోంది. 1. వేదాంత: మార్చి ఫ్యూచర్స్‌ను అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 126. స్టాప్‌లాస్‌ రూ. 140. మెటల్‌ కౌంటర్లలో చాలా కౌంటర్లు బలహీనంగా ఉన్నాయి. వీటిలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. వేదాంత షేరు ఇతర మెటల్‌ షేర్లతో పోలిస్తే పేలవంగా ఉంది. ప్రస్తుతం సరికొత్త బ్రేక్‌డౌన్‌కు రెడీగా ఉంది. ఆరు నెలల కన్సాలిడేషన్‌ షేరులో అప్‌మూవ్‌

దీర్ఘకాలంలో మార్కెట్‌పై కొవిడ్‌-19 ప్రభావం నిల్‌!

Tuesday 25th February 2020

మెటల్‌ స్టాక్స్‌పై ప్రతికూల ప్రభావం డీమార్ట్‌ గుడ్‌ కంపెనీ అరబిందో ఫార్మాలో ఇన్వెస్ట్‌మెంట్‌ హెచ్‌యూఎల్‌కు పన్ను ప్రయోజనాలు - నిశ్చల్‌ మహేశ్వరి, సెంట్రమ్‌ బ్రోకింగ్‌ కరోనా వైరస్‌.. దేశీ స్టాక్‌ మార్కెట్ల దీర్ఘకాలిక ఔట్‌లుక్‌పై ప్రభావాన్ని చూపే అవకాశాలు తక్కువేనంటున్నారు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సీఈవో నిశ్చల్‌ మహేశ్వరి. అయితే కరోనా మరింత విస్తరిస్తే మెటల్‌ కౌంటర్లకు దెబ్బతగిలే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మార్కెట్లు, పెట్టుబడి అవకాశాలు తదితర అంశాలపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం

Most from this category