News


కరోనాకు ఫైజర్‌ నుంచి ఔషధం!

Tuesday 3rd March 2020
Markets_main1583215596.png-32241

16 శాతం దూసుకెళ్లిన షేరు 
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నివారణకు వీలుగా అమెరికన్‌ మాతృ సంస్థ కెమికల్‌ కాంపౌండ్‌ను అభివృద్ధి చేసిన వార్తలతో ఫార్మా రంగ దిగ్గజం ఫైజర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు ఉన్నట్లుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఫైజర్‌ లిమిటెడ్‌ షేరు 16 శాతం దూసుకెళ్లింది. రూ. 4,925ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.6 శాతం జంప్‌చేసి రూ. 4,483 వద్ద ట్రేడవుతోంది. 

ఏడాది చివరికల్లా
అమెరికన్‌ మాతృ సంస్థ ఫైజర్‌ ఇంక్‌ యాంటీవైరల్‌ కాంపౌండ్స్‌ను అభివృద్ధి చేసినట్లు వెలువడిన వార్తలు దేశీ అనుబంధ సంస్థ ఫైజర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. కరోనా వైరస్‌లను అరికట్టేందుకు వీలుగా చేపట్టిన పరిశోధనలో భాగంగా వ్యాధిని నియంత్రించగల కొన్ని కాంపౌండ్స్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. కరోనాకు చెక్‌ పెట్టే బాటలో థర్డ్‌పార్టీతో కలిసి అభివృద్ధి చేస్తున్న కొన్ని యాంటీవైరల్‌ కాంపౌండ్స్‌ను ఫైజర్‌ ఇంక్‌ తాజాగా గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. మార్చిచివరికల్లా వీటి స్క్రీనింగ్‌ పూర్తికావచ్చని తెలుస్తోంది. ఇవి విజయవంతమైతే.. ఏడాది చివరికల్లా వీటిపై పరిశీలనను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఫైజర్‌ ఇంక్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ మైకేల్‌ డోల్‌స్టన్‌ సోమవారం అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ను కలవడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా నేపథ్యంలో చైనా నుంచి ఏపీఐల సరఫరాకు ఆటంకాలు ఏర్పడటంతో గ్లోబల్‌ స్థాయిలో ఫార్మా రంగం సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందని విశ్లేషకులు చెబుతున్న సంగతి తెలిసిందే.



You may be interested

వంటనూనెలు 10 శాతం చౌక!

Tuesday 3rd March 2020

కరోనా ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లతోపాటు వంట నూనె ధరలు పడిపోతున్నాయి. కరోనా వ్యాప్తితో అంతర్జాతీయ మార్కెట్లో మరో వారం రోజుల్లో వంటనూనెధరలు 10 శాతం తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా వంటనూనె ధరలు తగ్గితే దేశీయంగా వంటనూనె ధరలు భారీ తగ్గే అవకాశం ఉంది. మన దేశంలో వార్షిక ప్రాతిపదికన 2.35 కోట్ల టన్నుల వంటనూనెలు అవసరమవుతాయి. దీనిలో దాదాపు 70 శాతం వంట నూనెలను

దేశీ మార్కెట్లపట్ల బుల్లిష్‌: మొబియస్‌

Tuesday 3rd March 2020

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌కు అవకాశాలు కరోనా ప్రభావం​అత్యంత తక్కువకావడం సానుకూలం మొబియస్‌ కేపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకులు మార్క్‌ మొబియస్‌ ప్రస్తుతం ప్రపం‍చాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగా పెద్దగా ప్రభావం చూపబోదని వర్ధమాన మార్కెట్ల ఫండ్‌ మేనేజర్‌ మార్క్‌ మొబియస్‌ పేర్కొంటున్నారు. కరోనా ప్రభావం ఇక్కడ అత్యంత తక్కువగా నమోదుకావడం సానుకూల అంశమని చెబుతున్నారు. మొబియస్‌ కేపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకులు మార్క్‌ మొబియస్‌ ఒక ఇంటర్వ్యూలో చైనాలో పరిస్థితులు, దేశీ అవకాశాలు తదితర అంశాలపై

Most from this category