News


ఇంధన రిటైలింగ్‌లో సంస్కరణలు ..నష్టాల్లో పెట్రో షేర్లు

Thursday 24th October 2019
Markets_main1571893433.png-29105

దేశీయ ఇంధన రిటైలింగ్‌ రంగంలో చమురుయేతర సంస్థలు కూడా పెట్రోల్‌ బంకుల ఏర్పాటు చేసే వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత సరళతరం చేసింది. దీంతో దేశీయ ఇంధన మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు ప్రైవేట్, విదేశీ సంస్థలకు అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు దేశీయ ఇంధన మార్కెట్‌లో కీలకంగా ఉన్న ప్రభుత్వ పెట్రో కంపెనీలకు ప్రై‍వేటు సంస్థల నుంచి పోటి ఏర్పడనుంది. ఈ అంశంతో పాటు యుఎస్‌ చమురు నిల్వలు పడిపోవడంతో చమురు ధరలు గత సెషన్లో 2 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 2.5 శాతం పెరిగి బారెల్‌ 61.17 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 3.3 శాతం పెరిగి బారెల్‌ 55.51 డాలర్లకు చేరుకుంది. గత నాలుగు వారాలలో మొదటి సారిగా చమురు ధరలు గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. పై రెండు అంశాల వలన దేశీయ పెట్రో షేర్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీపీసీఎల్‌(భారత పెట్రోలియం) షేరు ఉదయం 10.27 సమయానికి 3.38 శాతం నష్టపోయి రూ. 509.30 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్లో రూ. 527.10 వద్ద ముగిసిన ఈ షేరు, రూ. 525.90 వద్ద ప్రారంభమైంది. అదేవిధంగా హిందుస్తాన్‌ పెట్రోలియం షేరు 2.12 శాతం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ 1.25 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.You may be interested

గరిష్టం నుంచి 1శాతం పతనమైన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 24th October 2019

గరిష్ట స్థాయి నుంచి 1శాతం పతనమైన ఇండెక్స్‌  ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో లాభాల్లోకి నుంచి నష్టాల్లోకి మళ్లింది. ఈ వారంలో ఇప్పటికి వరకు రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన బ్యాంకింగ్‌ రంగ గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు ఈ ఇండెక్స్‌ కిత్రం ముగింపు(29459.60)తో పోలిస్తే అరశాతం లాభం(145 పాయింట్లు)తో 29604.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో

పెరిగిన పసిడి

Thursday 24th October 2019

అంతర్జాతీయంగా గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌లో 8 డాలర్లకుపైగా పెరిగిన పసిడి గురువారం ఆసియా ట్రేడింగ్‌లో సైతం దాదాపు అదేస్థాయి వద్ద  ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 1,495 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరను  ప్రభావితం చేయగల బ్రెగ్జిట్‌ అంశం, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు సమావేశాలు లాంటి కీలక పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్రిటన్‌ బ్రెగ్జిట్‌కు 3నెలల

Most from this category