News


ఆగని పెట్రోరంగ షేర్ల పతనం

Tuesday 7th January 2020
Markets_main1578392969.png-30738

పెట్రో రంగ కంపెనీల షేర్ల వరుసగా పతనం మంగళవారం ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగింది. ఈ రంగానికి చెందిన బీపీఎసీల్, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి. ప్రపంచదేశాలకు ఎక్కువగా ముడిచమురును ఎగుమతి చేసే మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల వద్దే ట్రేడ్‌ అవుతున్నాయి. పెరిగిన ముడిచమురు ధరల కారణంగా మార్జిన్లు క్షీణించవచ్చనే భయాందోళనలు దేశీయ ఆయిల్‌ కంపెనీలను వెంటాడాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో ఆయిల్‌ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.467.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో నిన్నటి ముగింపు(రూ.469.15)తో పోలిస్తే 2శాతం నష్టపోయి రూ.459.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 1.50శాతం నష్టంతో రూ.462.05 వద్ద స్థిరపడింది.
హెచ్‌పీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.250.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో నిన్నటి ముగింపు(రూ.244.65)తో పోలిస్తే 2.18శాతం నష్టపోయి రూ.239.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి అరశాతం నష్టంతో రూ.244.00 వద్ద స్థిరపడింది. 
ఐఓసీ:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.125.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒకదశలో నిన్నటి ముగింపు(రూ.124.90)తో పోలిస్తే 0.64శాతం నష్టపోయి రూ.124.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసే సరికి 0.10శాతం స్వల్ప నష్టంతో రూ.124.80  వద్ద స్థిరపడింది. 



You may be interested

క్యు3లో మెరిసేదెవరు? నీరసించేదెవరు?

Tuesday 7th January 2020

మూడో త్రైమాసికంలో వివిధ రంగాల ఫలితాలపై అంచనాలు ఇలా ఉన్నాయి... 1. ఐటీ: టాప్‌ ఐటీ కంపెనీలు డాలర్‌ రెవెన్యూలో 1.5- 3 శాతం వృద్ది నమోదు చేయవచ్చు. విప్రో, టెక్‌మహీంద్రాలు ఈ దఫా మెరుగైన ఫలితాలు చూపవచ్చు. కంపెనీల మేనేజ్‌మెంట్‌ కామెంటరీ కీలకం కానుంది. దీనికితోడు రెవెన్యూ గైడెన్స్‌లో మార్పులను పరిశీలించాలి. బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో పనితీరు ఆధారంగా కంపెనీల ఫలితాలు ఉంటాయని అంచనా. 2. ఆటో:   ఆటో రంగంలో డౌన్‌ట్రెండ్‌ బాటమ్‌ అవుట్‌

2 రోజుల నష్టాలకు చెక్‌- సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ

Tuesday 7th January 2020

అన్ని రంగాలూ లాభాల్లోనే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ జోరు ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 193 పాయింట్లు ఎగసి 40,869 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 60 పాయింట్లు బలపడి 12,053 వద్ద నిలిచింది. అమెరికా, ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ గరిష్టంగా 41,230ను తాకింది. తదుపరి కొంతమేర మందగించి 40,727

Most from this category