News


వెలుగులోకి పెట్రోమార్కెటింగ్‌ షేర్లు

Wednesday 18th September 2019
Markets_main1568799538.png-28408

పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు గురువారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు చల్లారడం ఇందుకు కారణమవుతోంది.   తిరుగుబాటుదారుల డ్రోన్‌ దాడితో తగ్గిన చమురు ఉత్పత్తిని నెలాఖరులో పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడం అంతర్జాతీయంగా చమురు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఈ రంగలో ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీల్‌, ఐఓసీ షేర్లు 5.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.

బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.379.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5.50శాతం లాభపడి రూ.388.75 స్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.368.75)తో పోలిస్తే 4శాతం లాభంతో రూ.383.80 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.238.00లు రూ.421.00లుగా నమోదయ్యాయి.

హెచ్‌పీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.252.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 4.50శాతం లాభపడి రూ.256.70 స్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.2:50 ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.245.90)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.253.35 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00లు, రూ.333.50లుగా నమోదయ్యాయి.

ఐఓసీ:- నేడు ఎన్‌ఎస్‌ఈలోరూ.125.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.63 శాతం లాభపడి రూ.128.50 స్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.3:15 ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.125.20)తో పోలిస్తే 2.50శాతం లాభంతో రూ.128.25 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.105.00లు, రూ.170.75లుగా నమోదయ్యాయి. 



You may be interested

వాహనాలు, బిస్కెట్‌లపై జీఎస్‌టీ తగ్గింపు లేనట్టే?

Wednesday 18th September 2019

జీఎస్‌టీ రేట్లపై జీఎస్‌టీ కౌన్సిల్‌కు సిఫార్సులు చేసే ఫిట్‌మెంట్‌ కమిటీ, ప్రస్తుత పరిస్థితులలో కార్లు, బిస్కెట్‌లపై విధిస్తున్న జీఎస్‌టీ రేట్లలో ఎటువంటి మార్పు ఉండకూడదని జీఎస్‌టీ కౌన్సిల్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. కాగా ఆటోమొబైల్స్‌, వినియోగ ఆధారిత రంగాలపై జీఎస్‌టీ తగ్గుతుందని మార్కెట్‌ వర్గాలు ఆశించాయి. సెప్టెంబర్‌ 20 వ తేదిన జరగనున్న 37 వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ ఫిట్‌మెంట్‌ కమిటీ సిఫార్సులపై చర్చ జరుగుతుందనే విషయం తెలిసిందే.  ఆటోమొబైల్స్‌పై

ఒడిదుడుకులమయంగా బ్యాంక్‌ నిఫ్టీ ట్రేడింగ్‌

Wednesday 18th September 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. నేడు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,131.75)తో పోలిస్తే 174 పాయింట్ల లాభంతో 27,304.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ప్రారంభస్థాయి(27,304.70) నుంచి 216  పాయింట్లను నష్టపోయి 27,088.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ కనిష్టస్థాయి(

Most from this category