News


పెన్నా సిమెంట్‌ ఐపీఓకు సెబీ ఓకే

Wednesday 5th June 2019
Markets_main1559727156.png-26103

  • ఐపీఓ సైజు రూ.1,550 కోట్లు

న్యూఢిల్లీ: పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్‌... ఈ ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా రూ.250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌  లీడ్‌ మేనేజర్లుగా ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, యస్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తున్నాయి. పెన్నా సిమెంట్‌ కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో నాలుగు సిమెంట్‌ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్‌ యూనిట్లున్నాయి. 



You may be interested

సాంక్టమ్‌ నుంచి ఐదు సిఫార్సులు

Wednesday 5th June 2019

మిడ్‌టర్మ్‌లో 12-15 శాతం రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ సిఫార్సు చేస్తోంది. 1. దీపక్‌ నైట్రేట్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 375. స్టాప్‌లాస్‌ రూ. 310. గత సంవత్సరన్నర కాలంగా స్టాకు రూ. 205-305 మధ్య కన్సాలిడేట్‌ అవుతోంది. వీక్లీ చార్టుల్లో డబ్ల్యు ఆకార పాటర్న్‌ ఏర్పరిచింది. గతవారం ఈ ధోరణి నుంచి బ్రేకవుట్‌ ఇచ్చింది. బోలింగర్‌ బ్యాండ్‌ పైఅవధి పైన బ్రేకవుట్‌ సాధించడంతో ర్యాలీ కొనసాగుతుందన్న సంకేతాలు వస్తున్నాయి.

జూన్‌లో బుల్స్‌దే పైచేయి?!

Wednesday 5th June 2019

11ఏళ‍్లలో ఆరు సార్లు ర్యాలీ జరిపిన సూచీలు దేశీయ మార్కెట్లు జూన్‌ సీరిస్‌ను లాభాలతో ఆరంభించాయి. సూచీలు జూన్‌ ఆరంభంలో ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ నేపథ్యంలో ఇకపై ర్యాలీ కొనసాగుతుందా? లేక కన్సాలిడేషన్‌, కరెక‌్షన్‌ ఉంటాయా? అనే విషయమై రిటైల్‌ ఇన్వెస్టర్లలో డైలమా నెలకొంది. గత దశాబ్దకాలం పరిశీలిస్తే జూన్‌ నెల కొంతవరకు బుల్స్‌కే అనుకూలంగా ఉందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. గత పదకొండేళ్లలో 6 సార్లు సూచీలను బుల్స్‌ కంట్రోల్‌

Most from this category