News


పీసీ జ్యువెల్లర్స్‌ 18శాతం జూమ్‌

Tuesday 16th April 2019
Markets_main1555400854.png-25164

పీసీ జ్యువెల్లర్స్‌ షేర్లు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్స్‌లో లాభపడ్డాయి. నేటి బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో 18శాతం ర్యాలీ చేశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టింగ్‌ సంస్థ కర్లినా ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరు ధర రూ.105.73 ధర వద్ద ఏప్రిల్‌ 10న 37లక్షల ఈక్విటీ షేర్లను రూ.35 కోట్లకు, ఏప్రిల్‌ 14న అదే కంపెనీ 47లక్షల ఈక్విటీ షేర్లను రూ.46 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తం ఈక్విటీ షేర్ల వాటా కంపెనీలో 2శాతానికి సమానమైందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపడంతో 18.37శాతం పెరిగి రూ.149.45ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో కంపెనీ షేరు ఏకంగా 41శాతం లాభపడగా, ఏప్రిల్‌ 1వ తేదిన నుంచి 80 శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు (రూ.126.25) పోలిస్తే 16శాతం లాభంతో రూ.146.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.46.90  రూ.311.45లుగా నమోదయ్యాయి. 



You may be interested

11,800 శిఖరంపై నిఫ్టీ

Tuesday 16th April 2019

మార్కెట్‌ చరిత్రలో మొదటిసారిగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ-50....11,800 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. గతేడాది ఆగస్టులోనూ, ఈ ఏడాది మార్చిలోనూ 11,760 పాయింట్ల స్థాయి వరకూ పెరిగినప్పటికీ, 11,800 పాయింట్ల స్థాయిని అందుకోలేక దిగిపోయింది. అయితే ఈ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన నిఫ్టీ ఎట్టకేలకు ఈ ప్రధాన స్థాయిని చేరగలిగింది. నిఫ్టీ తాజా ఫీట్‌ సాధించడానికి బ్యాంకింగ్‌ షేర్లు ప్రధానంగా సహకరించాయి. ఈ మధ్యాహ్న సెషన్‌లో

జెట్‌ఎయిర్‌ 4.50శాతం డౌన్‌

Tuesday 16th April 2019

నిధుల సమీకరణ అంశంపై స్పష్టత రాకపోవడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ షేర్లు మంగళవారం మరో 4శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు రూ.254.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ అత్యవసర కార్యకలాపాల నిర్వహణకు మూలధన నిధుల సమీకరించే అంశంపై సోమవారం బ్యాంకర్లు, యాజమాన్యంతో చర్చలు జరిపారు. చర్చలు సుధీర్ఘంగా జరిగినప్పటికీ ఇరువర్గాలు తుది నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో సమావేశాన్ని నేటి వాయిదా చేస్తున్నట్లు కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వినయ్‌

Most from this category