News


పేటిఎం అతి పెద్ద నిధుల సమీకరణ!

Monday 25th November 2019
Markets_main1574657364.png-29830

దేశీయ చెల్లింపుల కంపెనీ పేటిఎం తాజాగా 1 బిలియన్‌ డాలర్ల నిధులను ఫైనాన్సింగ్‌ రౌండ్‌ ద్వారా సమీకరించింది. ఈ ఫైనాన్సింగ్‌ రౌండ్‌ యుఎస్‌ ఆస్తి నిర్వహణ సంస్థ టీ రోవ్‌ ఫ్రైస్‌ నేతృత్వంలో జరగగా, కంపెనీ ఇన్వెస్టర్లయిన యాంట్‌ ఫైనాన్సియల్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ కూడా పాల్గొన్నాయి. ఈ ఏడాది ఇండియన్‌ స్టార్టప్‌ కంపెనీలో జరిగిన అతి పెద్ద నిధుల సమీకరణ ఇదేనని కంపెనీ తెలిపిం‍ది. దీంతో కంపెనీ వాల్యుషన్‌ 16 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ కంపెనీలతో పాటు పేటిఎం షేర్‌హోల్డర్‌ కంపెనీ అయిన డిస్కవరి క్యాపిటల్‌ కూడా ఈ నిధుల సమీకరణలో పాలుపంచుకుంది. ‘ఇది టీ రోవ్‌ ప్రైస్‌ సారధ్యంలోని ఒక బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ’ అని పేటిఎం మాతృ సం‍స్థయిన వన్‌97 కమ్యునికేషన్స్‌ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ అన్నారు. ఈ కంపెనీలో సాఫ్ట్‌ బ్యాంక్‌ 200 మిలియన్‌ డాలర్లను, యాంట్‌ ఫైనాన్సియల్‌ 400 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. తాజా నిధుల సమీకరణతో ఈ కంపెనీ ఇప్పటి వరకు ఏకంగా 3.5 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించినట్టయ్యింది. కాగా తాజాగా జరిగిన ఈ నిధుల సమీకరణ అక్టోబర్‌ 15 వ తేదీన చోటుచేసుకుంది. తాజా నిధుల సమీకరణపై మాట్లాడేందుకు టీ రోవ్‌ ప్రైస్‌ నిరాకరించింది.
    పేటిఎం 2018 సెప్టెంబర్‌లో 300 మిలియన్‌ డాలర్లను నిధులను వారెన్‌బఫెట్‌ బెర్క్‌షైర్‌ హతవే ద్వారా సమీకరించింది. అప్పుడు కంపెనీ విలువ 10 బిలియన్‌ డాలర్లు. ఆ తర్వాత ప్రధానంగా జరిగిన నిధుల సమీకరణ ఇదే కావడం గమనార్హం. ‘ప్రస్తుత, కొత్త ఇన్వెస్టర్ల ద్వారా సమీకరించిన పెట్టుబడులు, ఇండియన్‌లకు కొత్తతరం ఫైనాన్సియల్‌ సర్వీసులను అందించాలనే మా నిబద్ధతకు తార్కణం’ అని శర్మ అన్నారు. చిన్న నగరాలలోని వినియోగదారులను చేరుకునేందుకు వచ్చే మూడేళ్లలో పేటిఎం రూ. 10,000 కోట్లను ఇన్వెస్ట్‌ చేయనుందని, పేటిఎం నిర్వహిస్తున్న చెల్లింపులు, టికెటింగ్‌ వంటి వ్యాపారాలు బాగా రాణిస్తున్నాయని, కంపెనీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఇన్సురెన్స్‌ వంటి కొత్త వ్యాపారాల కోసం ఇన్వెస్ట్‌ చేయనుందని తెలిపారు. ‘మా కంపెనీ చెల్లింపుల వ్యాపారం వృద్ధి చెందింది. ఇతర విభాగాలు కూడా కొంత నిధులను సంపాదిస్తున్నాయి’ అని ఆయన అన్నారు. గూగుల్‌ పే, అమెజాన్‌ పే, ఫోన్‌ పే వంటి కంపెనీల నుంచి వచ్చే రిస్క్‌ను శర్మ తోసిపుచ్చారు. ‘అఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ వ్యాపారాలలో మాకు మంచి మార్కెట్‌ వాటా ఉంది’ అని ఆయన అన్నారు. ‘ఈ కంపెనీలు గత రెండు మూడేళ్ల నుంచి బిలియన్‌ డాలర్లను ఖర్చుపెట్టాయి. కానీ మా చెల్లింపుల వ్యాపారాన్ని టచ్‌ చేయలేకపోయాయి. మేము మా వ్యాపారాన్ని కాపాడుకోవడమే కాదు, మా మార్కెట్‌ వాటను పెంచుకుంటున్నాం కూడా’ అని శర్మ తెలిపారు.
    సాఫ్ట్‌ బ్యాంక్‌ 2017లో మొదటి సారిగా పేటిఎంలో ఇన్వెస్ట్‌ చేసి 19 శాతం వాటాను దక్కించుకుంది. అదే విధంగా అలిబాబా గ్రూప్‌కు చెందిన యాంట్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ పేటిఎంలో 38 శాతం వాటను పొందింది. వన్‌97 కమ్యునికేషన్స్‌ ఆర్థిక సంవత్సరం 2019లో రూ. 3,959.6 కోట్లు నికర నష్టాలను ప్రకటించింది. ఇది అంతకు ముందటి ఏడాదిలో రూ. 1,490 కోట్లుగా నమోదైంది. ఈ కంపెనీ స్టాండ్‌ ఎలోన్‌ రెవెన్యూ ఆర్థిక సంవత్సరం 2018లో స్వల్పంగా పెరిగి రూ. 3,229 కోట్లు నుంచి రూ. 3,319 కోట్లకు చేరుకుంది. కాగా ఈ కంపెనీ ప్రత్యర్ధ కంపెనీలయిన ఫోన్‌ పే, అమెజాన్‌ పే కూడా భారీ నష్టాలను ప్రకటించాయి. ఆర్థిక సంవత్సరం 2019లో ఫోన్‌ పే రూ. 1,904.72 కోట్ల నికర నష్టాన్ని, అమెజాన్‌ పే రూ. 1,160.8 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించాయి. You may be interested

ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ!

Monday 25th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్లో స్వల్పంగా పెరిగి 71.69 వద్ద ప్రారంభమైంది. రూపీ శుక్రవారం సెషన్‌లో 71.71 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలకు సంబంధించి అనేక వార్తలు వెలువడడంతో సోమవారం సెషన్‌లో డాలర్‌, ఎగుమతి కేంద్రీకృత కరెన్సీలు బలపడ్డాయి. అంతేకాకుండా బ్రెగ్జిట్‌పై ఆశలు పెరగడంతో బ్రిటన్‌ పౌండ్‌ బలపడింది. ‘యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గుతోంది. గత వారం రూపీ-డాలర్‌ జంట్‌

వారం కనిష్టానికి పసిడి

Monday 25th November 2019

అమెరికా చైనాల దేశాధ్యక్షులు మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలపడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం ఉదయం సెషన్‌లో వారం కనిష్టానికి దిగివచ్చింది. అమెరికా పటిష్టమైన ఆర్థిక గణాంకాలను వెలువరించడంతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం కూడా పసిడి ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 1,460.60 డాలర్ల వద్ద వారం రోజుల కనిష్టాన్ని తాకింది. ఆశావహ

Most from this category