News


రానున్న రోజుల్లో మార్కెట్‌ మున్ముందుకే..!

Wednesday 15th January 2020
Markets_main1579081570.png-30951

ఆసియా యూరప్‌ మార్కెట్లలో నెలకొన్న అమ్మకాలతో రెండు రోజుల వరుస రికార్డు ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్‌ బుధవారం కన్సాలిడేషన్‌ దిశగా కదులుతోంది. ఈ తరుణంలో మార్కెట్‌ గమనంపై విశ్లేషకులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మార్కెట్‌ ర్యాలీలో సత్తా ఇంకా అయిపోలేదని, మార్కెట్‌ దిగివచ్చిన ప్రతిసారి కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు వారు సలహానిస్తున్నారు. చైనాపై సుంకాలు ప్రస్తుతానికి కొనసాగుతాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలతో నేడు ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు నెలకొన్నాయి. 

కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయానికి(పిబ్రవరి 1)కల్లా సెన్సెక్స్‌ 42000 మార్కును దాటుతుందని, నిఫ్టీ 12700 దిశగా సాగుతుందని  మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. నిన్నరోజు(జనవరి 14)న సెన్సెక్స్‌ 41,994 వద్ద, నిఫ్టీ 12,374 వద్ద కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్న సంగతి తెలిసిందే  

బడ్జెట్‌ ప్రవేశపెట్టేలోగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ బెంచ్‌మార్క్‌ సూచీల ర్యాలీని అధిగమిస్తుంది. అయితే నిఫ్టీ-50 ఇండెక్స్‌  12,200-12,000 మద్దతు స్థాయిని నిలుపుకోగలిగితే.., అప్‌ట్రెండ్‌ కొనసాగవచ్చని వారంటున్నారు.

‘‘మార్కెట్‌ మూమెంటమ్‌ కొనసాగే అవకాశ ఉంది. సెన్సెక్స్‌ 43,100 స్థాయిని, నిఫ్టీ 12,650 స్థాయిని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటిడ్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ గౌరవ్‌ గార్గ్‌ అంచనా వేస్తున్నారు. 

ఇరాన్‌ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టడంతో పాటు అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల్లో భాగంగా సానుకూల వార్తలు వెలుగులోకి రావడంతో మార్కెట్‌లో పాజిటివ్‌ సంకేతాలను చూస్తున్నాము. స్థిరమైన కరెన్సీ ర్యాలీ, క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత బలపరుస్తాయని గార్గ్‌ తెలిపారు. 

బడ్జెట్‌ ప్రవేశపెట్టేలోపు మార్కెట్‌ దిగివచ్చిన ప్రతిసారి  కొనుగోలు చేయడం ఉత్తమం. నిఫ్టీ ఇండెక్స్‌ 12350 నిరోధస్థాయిని దాటినట్లయితే.. ఇండెక్స్‌ 12500ని తదుపరి 12700ని సునాయసంగా ఛేదిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


‘‘స్వల్పకాలిక పరిణామాలను మార్కెట్‌ పరిగణలోకి తీసుకోదు. అయితే నిఫ్టీ 12550 స్థాయిని ఫిబ్రవరి అధిగమిస్తే మార్చిలో 12700 స్థాయిని ఛేదింవచ్చు. ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య మిడ్‌క్యాప్‌ షేర్ల ర్యాలీ ఉద్రితంగా ఉంటుంది. అని ప్రీతం డ్యూస్కర్, ఫండ్ మేనేజర్, బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్ ఫండ్‌ మేనేజర్‌ ప్రీతం ద్యూస్కర్‌ తెలిపారు.

ఇక టెక్నికల్‌ చూసినట్లైతే... 
నిఫ్టీ కీలకమైన మద్దతు శ్రేణిలో 12350-12400 మధ్యలో కదలాడుతోంది. ఇండెక్స్ 12200-12000 స్థాయిలను పట్టుకోగలిగితే, మార్కెట్లు బలమైన బౌన్స్-బ్యాక్‌ను ప్రదర్శించే అవకాశాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఇండెక్స్ 12200-12000 స్థాయిలను నిలబెట్టుకోగలితే.., మార్కెట్లు బలమైన బౌన్స్-బ్యాక్‌ను ప్రదర్శించే అవకాశాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. 12350-12400 స్థాయిని నిరోధాన్ని చేధించగలిగితే... 12545/12700 స్థాయిని చేరుకునేందుకు మరింత సమయం పట్టదు. అయితే డౌన్‌సైడ్‌ ట్రెండ్‌కు12300 వద్ద కీలక మద్దతు స్థాయి ఉంది అని ట్రేడింగ్‌ బెల్స్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సంతోష్‌ మీనా అభిప్రాయపడ్డారు. 

 You may be interested

ఇన్‌ఫ్రా, కన్జూమర్‌, ఫైనాన్స్‌కు ఫండ్స్‌ ఓటు

Wednesday 15th January 2020

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించనున్న సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో ఇటీవల మ్యూచువల్‌ ఫండ్స్‌ మౌలిక సదుపాయాలు(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌), వినియోగం(కన్జూమర్‌), ఆర్థిక సేవలు(ఫైనాన్స్‌) రంగాలపట్ల ఆసక్తి కనబరుస్తున్నాయి. డిసెంబర్‌(2019)లో దేశీ ఫండ్స్‌(ఎంఎఫ్‌లు) షాపింగ్‌ జాబితాలో ఈ రంగాల కంపెనీలకే ప్రాధాన్యం లభించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వివరాలు చూద్దాం... దేశీ మ్యూచువల్‌ ఫండ్‌ అసోసియేషన్‌(యాంఫీ) వివరాల ప్రకారం గతేడాది(2019)లో స్టాక్‌ మార్కెట్లు 12 శాతం బలపడ్డాయి. ఇదే సమయంలో ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 10

యస్‌ బ్యాంక్‌- కెపాసైట్‌- పీఎన్‌బీహెచ్‌ జోరు

Wednesday 15th January 2020

వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా నేడు అమెరికా, చైనా ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మా‍ర్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. మధ్యాహ్నం 2.30 కల్లా సెన్సెక్స్‌ 210 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. అయితే ఈ పరిస్థితుల్లోనూ యస్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ మూడు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ లాభాలతో సందడి

Most from this category