News


భారత్‌లో హ్యాండ్‌సెట్ల తయారీకి అంతరాయం..?

Thursday 13th February 2020
Markets_main1581588309.png-31765

 భారత్‌లో హ్యాండ్‌ సెట్‌ తయారీ పరిశ్రమలు త్వరలో ఫోన్ల  తయారీని  నిలిపి వేయనున్నట్లు నిపుణులు  చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా కరోనా ప్రభావంతో చైనా పరిశ్రమలు మూతపడిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలను వివిధ దేశాలు ఎగుమతి చేసే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. తాజా పరిస్థితుల్లో ఎక్కడిక్కడ పరిశ్రమలు మూతపడి ఉత్పత్తులు ఆగిపోయాయి. విడిభాగాల  సరఫరా నిలిచిపోయింది. దీంతో వచ్చే వారం నుంచి స్మార్ట్‌ఫోన్‌ తయారీ పూర్తిగా క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి-మార్చి త్రైమాసికంలో 10-15 శాతం విక్రయాలు పడిపోనున్నాయి. దీని ప్రభావం ఏప్రిల్‌-జూన్‌ మాసాలలో విడుదల కావాల్సిన కొత్త ఫోన్లపై పడి అవి 4నుంచి 5 వారాలు ఆలస్యంగా విడుదల అవుతాయిని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్‌ ఐఫోన్‌ అమెరికాదైనప్పటికీ దాని విడిభాగాలన్నీ చైనాలోనే తయారవుతాయి. ఈ ఫోన్లను ఏదేశంలోనైనా విక్రయించాలంటే చైనా నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని ఆయాదేశాల్లో అసెంబ్లింగ్‌ చేసి అమ్ముతారు. తాజా కరోనా ప్రభావంతో వీటి సరఫరా ఆగిపోవడంతో ప్రస్తుతం ఉన్న నిల్వలు అయిపోయాయని రిటైలర్‌లు చెబుతున్నారు. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం పరిశ్రమల సెలవులను పొడిగించింది. దీంతో  సరఫరా చెయిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని షావోమీ ఇండియా అధికారులు వెల్లడించారు. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. దీనిపై ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌(ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహిండ్రూ స్పందిస్తూ... పరిశ్రమల్లో ఉత్పత్తులు అయిపోవడం ప్రారంభమైందని, మరో వారంరోజులు ఇదే కొనసాగితే  ఫోన్ల తయారీకి అంతరాయం ఏర్పడుతుందన్నారు. అయితే స్మార్ట్‌ ఫోన్లలో వాడే బ్యాటరీ, కెమెరా మాడ్యూల్స్‌ వియత్నాంలో తయారవుతాయి. డిస్‌ప్లే, కనెక్టర్స్‌ అధిక భాగం చైనాలోనే తయారవుతాయి. చిప్‌లు తైవాన్‌లో తయారవుతున్నప్పటికీ ఫైనల్‌గా చిప్‌ మార్కెట్‌లోకి రావాలంటే మాత్రం చివరి దశలో చైనాలో రూపొందాల్సిందే. ఫీచర్ల ఫోన్ల ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీ) విడిభాగాలన్నీ చైనా నుంచి దిగుమతి చేతసుకోవాల్సిందే. అందువల్ల వచ్చే మరికొన్ని నెలల్లో ఫోన్ల కొరత ఏర్పడనుంది. ఇప్పటికే ఐఫోన్‌ 11, 11ప్రోలు స్టాక్‌ లేదని రిటైలర్‌లు చెబుతున్నారు. 
 You may be interested

స్వల్పకాలానికి టాప్‌-10 సిఫార్సులు

Thursday 13th February 2020

జనవరి రిటైల్‌ ద్రవ్యోల్యణ గణాంకాలు, డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో గురువారం మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు, విశ్లేషకులు స్వల్పకాలానికి  10 షేర్లను రికమెండ్‌ చేస్తున్నారు 1. అనలిస్ట్‌ పేరు: జై థక్కర్‌ షేరు పేరు: ఐసీఐసీఐ బ్యాంక్‌  రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.570 స్టాప్‌ లాస్‌: రూ.537 2. అనలిస్ట్‌ పేరు: జై థక్కర్‌ షేరు పేరు: ఐషర్‌ మోటర్స్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.20,300 స్టాప్‌ లాస్‌: రూ. 18790 3.

1-3 నెలలకు.. 5 స్టాక్స్‌!

Thursday 13th February 2020

దేశ, విదేశీ అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతూ కదులుతున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిలో ఒడిదొడుకులను చవిచూస్తోంది. నిఫ్టీ 12,272 పాయింట్లను అధిగమిస్తే.. 12,500వైపునకు కదలవచ్చు. మరోపక్క వెనకడుగు వేస్తే.. 12,100 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి బలహీనపడితే 11,990 వద్ద మరోసారి సపోస్ట్‌ కనిపించే వీలుంది. ఈ అంచనాలతోపాటు చార్టుల ఆధారంగా ఐదు స్టాక్స్‌ బ్రేకవుట్‌ సాధించాయని చెబుతున్నారు

Most from this category