News


ఆటో సెక్టార్‌పై జీఎస్టీ తగ్గనుందా..?

Wednesday 4th March 2020
Markets_main1583304747.png-32268

ఆటో రంగంలో జీఎస్టీ భారం కొంత మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు జీఎస్టీ రేట్లను తగ్గించాలని  పార్లమెంటరీ ప్యానెల్‌ సూచించింది. అంతేకాకుండా 2018 జులై నుంచి నెగిటివ్‌ వృద్ధి చూపుతున్న ఆటోమొబైల్‌ ఉత్పత్తిని మరింత పెంచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏకీకృత విధానంలో రోడ్డు పన్ను విధించాలని పార్లమెంట్‌కు సమర్పించిన  హెవీ ఇండస్ట్రీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ 2020-21 నివేదికలో పేర్కొంది. కాగా భారత దేశంలో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీ వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద రంగం. భారత దేశ జి.డి.పిలో ఇండస్ట్రియల్‌ రంగం నుంచి 27 శాతం , ఉత్పత్తి నుంచి 49 శాతం నమోదవుతుంది. ఇంకా ఈరంగం  ప్రత్యక్షంగానీ, పరోక్షంగా గానీ 3.7 కోట్ల ఉద్యోగాలను కల్పింస్తుంది. దేశవ్యాప్తంగా వసూలవుతున్న జీఎస్టీలో 15 శాతం(రూ.1.5 లక్షల కోట్లు) ఈ రంగం నుంచే వస్తుందని ప్యానెల్‌ తెలిపింది. భారత ఆర్థిఖ వృద్ధిలో ఇంతటి ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆటోమొబైల్‌ రంగం 2018 జూలై నుంచి నెగిటివ్‌ వృద్ధిని నమోదు చేస్తుందని వెల్లడించింది. ఈ రంగం ప్రతికూల వృద్ధి చూపడానికి  వినియోగదారుల రుణ సౌకర్యం అందుబాటులో లేకపోవడం, బ్యాంకులు రుణాలు మంజూరు చేయడానికి కఠినమైన నిబంధనలు అనుసరించడం, థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ 5 ఏళ్లకాలం ఉండడంతో రేట్లు పెరగడం, 2020 ఏప్రిల్‌ నుంచి BS-VI వాహనాలను ప్రవేశపెట్టడం, ఆటోమొబైల్స్‌ సంబంధిత  విడిభా గాలపైన జీఎస్టీ రేట్లు అంధికంగా ఉండడం వంటివి నెగిటివ్‌ వృద్ధికి కారణాలని  పార్లమెంట్‌​ ప్యానల్‌ వెల్లడించింది. అందుకే ఆటోరంగపై జీస్టీ తగ్గించాలని, 5 ఏళ్ల ఇన్స్‌రెన్స్‌ను రద్దు చేయడం, లేదా వాయిదా వేయాలని ప్యానెల్‌ సూచించింది. కొత్త వాహనాల విక్రయాలు పెరిగేందుకు స్ర్కాపేజ్‌ విధానాన్ని అనుసరించాలని,దిగుమతి వాహనాలపై, ఎలక్ట్రికల్‌ వాహనాలలో ఉపయోగించే లిథియం అయాన్‌ సెల్‌ బ్యాటరీలపై సుంకం తగ్గించాలని చెప్పింది. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పన్ను విధించాలని స్పష్టంచేసింది.  ఢిల్లీ- చంఢీఘడ్‌లో ఉన్న తొలి ఈ-వాహన ఎక్స్‌ప్రెస్‌వే వంటివాటిని ఢిల్లీ-జైపూర్‌, ముంబై-పూనేలలో విస్తరించాల్సిన అవసరం ఉందని ప్యానల్‌ పార్లమెంట్‌కు వివరించింది. 
 You may be interested

రికవరి బాటలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా షేర్లు ..!

Wednesday 4th March 2020

మార్కెట్‌ వరుస ఏడురోజుల పతనంలో భాగంగా దాదాపు 13లక్షల కోట్ల ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఉద్దీపన చర్చల ప్రకటనలపై ఆశలతో పాటు ఆర్‌బీఐ సైతం ఈక్విటీ మార్కెట్లు సాఫీగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామని అభయం ఇవ్వడంతో మంగళవారం మార్కెట్‌ లాభంతో ముగిసింది. మార్కెట్‌ రివకరీలో భాగంగా ఏస్‌ ఇన్వెస్టర్ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్లు ఎక్కువగా రికవరి అయ్యాయి.  ఫైనాన్స్‌ మార్కెట్ల

ఈ స్టాక్స్‌.. టెక్నికల్‌ బయ్స్‌

Wednesday 4th March 2020

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ అత్యవసర ప్రాతిపదికన వడ్డీ రేట్లను తగ్గించింది. ఫండ్స్‌ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. అయినప్పటికీ మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 3 శాతం పతనమయ్యాయి. మరోపక్క చైనా, జపాన్‌, యూరోపియన్‌ దేశాల కేంద్ర బ్యాంకులు, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు సైతం కరోనాపై యుద్ధానికి సన్నద్ధతను వ్యక్తం చేశారు. అయితే గతంలోలేని విధంగా

Most from this category