News


ఐటీ, కార్పోరేట్‌ బాంకుల్లో ఇన్వెస్ట్‌ చేయోచ్చు: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 25th June 2019
Markets_main1561456247.png-26563

  • ఐటీలో హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఫసిస్‌
  • ఎన్‌బీఎఫ్‌సీలో బజాజ్‌ ఫైనాన్స్‌, చోలమండలం, సుందరం ఫైనాన్స్‌ 
  • పార్మా రంగంలో టొరంటోను పరిశీలించోచ్చు

మార్కెట్‌లోకి నగదు ప్రవాహం జరిగేంత వరకు మనం ఇప్పట్లో ఎటువంటి మార్కెట్‌ అప్‌టిక్‌ను చూడలేమని ఐఐఎఫ్‌ఎల్‌ వీపీ రిసెర్చ్‌ అభిమన్యు సోపత్‌ అన్నారు. ఓ అంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రస్తుతం ఏఏ  స్టాక్‌లలో ఇన్వెస్ట చేయవచ్చో, ఏ రంగం ఎలా ఉందో వివరించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే...

ప్రభుత్వ తక్షణ చర్యలు ముఖ్యం.. 
ద్రవ్యోల్బణం తగ్గి, దేశియ ఆర్థిక వ్యవస్థ బలపడాలని  ఇన్వెస్టర్లు కొరుకుంటున్నారు. కానీ ఇప్పుడు వడ్డి రేట్లు తగ్గాయి. ఈ రెండు విషయాలు కొంచెం తికమక పెట్టేటట్టుగా ఉన్నాయి. అంతే కాకుండా వివిధ రకాల  ఆస్తుల మధ్య సంబంధాలలో మనకు అనుమానాలు స్పస్టంగా కనిపిస్తున్నాయి. దేశియ ఆర్థిక వ్యవస్థలో సమస్యేంటంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా మనకు వృద్ధి కనిపించడం లేదు. ఎన్‌బీఎఫసీ సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం వేగంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క ఎన్‌బీఎఫ్‌సీనే కాదు తయారి రంగం , ఇతర రంగాలలోని సమస్యలను తీర్చడానికి  ప్రభుత్వం వేగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. మనం అధికంగా ప్రకృతి వనరులను దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సమస్యలు ఏ రెండు మూడు వారాల కిందట మొదలైనవి కావు. కొన్ని ఏళ్లకు ముందు నుంచి ఎదుర్కొంటున్నావే.  లిక్విడిటీ సమస్య వలన సంక్షోభం‍లో కూరుకుపోయిన ఎన్‌బీఎఫ్‌సీ రంగాన్ని ప్రభుత్వం వేగంగా ఆదుకుంటే మార్కెట్‌ రుణాలకు భయపడి క్లయింట్‌లు తమ ఆస్తులను అమ్ముకోరు. ఈ సంక్షోభం వలన మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లు కుదేలవ్వడం చూశాం. నగదు అందుబాటులోకి వచ్చేంత వరకు వీటి వృధ్ధి మందగమనంలోనే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జలాన్‌ కమిటీ తన సిఫార్సులను  వచ్చే నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. వచ్చే రెండు మూడు వారాల వరకు మార్కెట్‌లో ఎటువంటి పెద్ద మార్పును చూడలేకపోవచ్చు. 

ఆకర్షిస్తోన్న కొన్ని స్టాకులు..
   ఈ మధ్య కాలంలో కొన్ని స్టాక్‌లు మిడ్‌ క్యాప్‌ రెంజ్‌లో బాగా పెట్టుబడులను ఆకర్షించాయి.  మార్కెట్‌ ఆకర్షిస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 60 శాతం వాటా ఓ 10-12 స్టాక్‌లవే ఉంటాయి.  ఆ (బాగా రాణిస్తోన్న స్టాక్‌లు) 10 స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు సిద్ధపడుతున్నారు. వీటిలో పెట్టుబడులు పెట్టడం మంచిదనే ఆలోచన మార్కెటలో పెరిగింది. అందువలన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు రాణించగలవు. పార్మా రంగంలో పెట్టుబడుల పెట్టలనుకునే వారికి  ఐటీ రంగం మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఈ రంగంలో మంచి వాల్యుషన్‌ కలిగిన కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. గత రెండేళ్ల నుంచి పార్మా సెక్టార్‌ దిగాలుగా ఉంది. ఎఫ్‌డీఏ నిబంధనలను కఠినతరం చేయడమే కాకుండా జనరిక్‌ ఔషదాల ధరలు తగ్గడం కూడా దీనికి కారణం. అందువలన ఐటీ సెక్టార్‌, కార్పోరేట్‌ బ్యాంకింగ్‌ షేర్లలో పెట్టుబడుల పెట్టడం మం‍చిది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఎల్‌ఐసీ బలంగా ఉంది. మిగిలిన కంపెనీలు మొండిబకాయిలతో సతమవుతున్నారు. దీనితో పాటు హౌసింగ్‌ సెక్టార్‌లో వృద్థి మందగమనాన్ని చూడవచ్చు. బజాజ్‌ ఫైనాన్స్‌, చోళమండలం, సుందరం ఫైనాన్స్‌ వంటి మూలధనాన్ని పెంచుకోగలిగే కంపెనీలలో ఇన్వెస్ట చేయడం మంచిదే. 

ఇన్సూరెన్స్‌, ఐటీ రంగాలలో..
  ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో ఇన్వెస్టమెంట్లు ఎక్కువగానే  ఉంటాయి. ఏ ఇన్సూరెన్స్‌ కంపెనీ మంచిది అనే విషయం చెప్పడం కష్టం కానీ కంపెనీ వాల్యుషన్‌ ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ ముందుంది. ఎస్‌బీఐ లైఫ్‌ కూడా హెచ్‌డీఎఫ్‌సీ స్థాయిలోనే ఉంది. బజాజ్‌ ఫైనాన్స్‌ కథను రిపీట్‌ చేద్దాం అనుకుంటే బజాజ్‌ ఫిన్సర్వలో పెట్టుబడులు పెట్టడము ఉత్తమం. ఎందుకంటే ఇన్య్సూరెన్స్‌ సెక్టార్‌లో పెరుగుదలతో పాటు కంపెనీ పెరుగుదల ట్రాజక్టరీ కూడా బాగుంది. అంతేకాకుండా దీని అనుబంధ సంస్థైన బజాజ్‌ ఫైనాన్స్‌ 35 శాతం జీఏజీఆర్‌ వృద్ధితో దూసుకుపోతుంది. ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎంఫసీస్‌ వంటి కంపెనీలు వాటి వాల్యుషన్ల కారణంగా బలంగా ఉన్నాయి. ఐబీఎమ్‌ నుంచి కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేశాక హెచ్‌సీఎల్‌ లాభల్లో ట్రేడవ్వడానికి అవకాశాలు పెరిగాయి. 
 
పార్మాలో ‘టొరంటో’..
పార్మా రంగంలో రెండు మూడేళ్లలో లాభాలు పొందాలనుకుం‍టే టొరంటో పార్మాలో ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. కంపెనీ గత త్రైమాసికంలో నష్టాలను ప్రకటించినప్పటికి యూనికెమ్‌ను కలుపుకున్నాక కంపెనీ రెవెన్యూ పెరగనుంది. పార్మా రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు టొరంటో పార్మ వైపు ఆలోచించవచ్చు. అమెరికా జనరిక్‌ మెడిసిన్‌పై దృష్ఠి పెట్టే కంపెనీలు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. టొరంటో కాకుండా పార్మారంగంలో ఇంకేదైనా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే ఇప్కా లాబ్‌ను పరిశీలించవచ్చు.

 



You may be interested

ఎస్‌బీఐ లైఫ్‌ 4.31 శాతం డౌన్‌

Tuesday 25th June 2019

బీఎన్‌పీ పారిబా కార్డిఫ్‌ 2.5 కోట్ల ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌  షేర్లను మార్కెట్‌ ధరకంటే డిస్కౌంట్‌లో ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించడంతో మంగళవారం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్య్సూరెన్స్‌ షేరు 4.31 శాతం నష్టపోయి రూ.680 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బీఐ లైప్‌ ఇన్సూరెన్స్‌లో బీఎన్‌పీ పారిబాకు 7.7 శాతం వాటా ఉండగా ఎస్‌బీఐకు 62.10 శాతం వాటా ఉంది. గత సెషన్‌ ధర కంటే 8.5

షార్ట్‌టర్మ్‌ కోసం నార్నోలియా సిఫార్సులు

Tuesday 25th June 2019

స్వల్పకాలానికి దాదాపు 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ రికమండ్‌ చేస్తోంది. 1. వెల్‌స్పన్‌ కార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 160. స్టాప్‌లాస్‌ రూ. 122. ఇటీవల కాలంలో రూ. 89 వద్ద కనిష్టాన్ని తాకిన తర్వాత వేగంగా రీబౌండ్‌ అయింది. ప్రస్తుతం కీలక డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతోంది. ఇండికేటర్లు మరింత అప్‌మూవ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. 2. అపోలో టైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 220.

Most from this category