News


పార్క్‌ హోటల్స్‌ ఐపీఓ @ రూ.1,000 కోట్లు

Tuesday 17th March 2020
news_main1584413818.png-32515

పార్క్‌ హోటల్స్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్‌, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, జైపూర్‌, జోధ్‌పూర్‌, కోయంబత్తూర్‌ తదితర నగరాల్లో ద పార్క్‌ బ్రాండ్‌ బ్రాండ్‌ హోటళ్లను నిర్వహిస్తోంది. 


ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. 



You may be interested

'యస్‌' షేర్ల ట్రేడింగ్‌పై ఆంక్షలు

Tuesday 17th March 2020

ఆందోళనలో ఎఫ్‌పీఐలు, సంస్థాగత ఇన్వెస్టర్లు మరింత ముందుగానే సూచీల నుంచి తొలగింపు రేపట్నుంచీ బ్యాంక్‌ డిపాజిట్‌  విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షల ఎత్తివేత న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా షేర్ల ట్రేడింగ్‌పై హఠాత్తుగా ఆంక్షలు విధించడం.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) సహా ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న షేర్లలో పాతిక శాతానికి మించి విక్రయించడానికి లేకుండా విధించిన నిబంధనతో సోమవారం మదుపరులు తీవ్ర సమస్యలు

ఎస్‌బీఐ కార్డ్స్‌కు కోవిడ్‌-19 సెగ

Tuesday 17th March 2020

(అప్‌డేటెడ్‌..) రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం... ఎస్‌బీఐ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్ల లిస్టింగ్‌పై కోవిడ్‌-19 వైరస్‌ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్ల లిస్టింగ్‌ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా

Most from this category