STOCKS

News


ఐపీఓకి వస్తున్న పార్క్‌ హోటల్స్‌

Wednesday 1st January 2020
Markets_main1577875496.png-30593

ఏపీజే సురేంద్ర గ్రూప్‌నకు చెందిన పార్క్‌ హోటల్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ కోసం ముసాయిదా పత్రాలను సెబి వద్ద దాఖలు చేసింది. ఈ ఆఫర్‌తో రూ. 1000 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఐపీఓలో కొత్తగా రూ. 400 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. మరో రూ.600 కోట్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా సమీకరించనుంది. ఓఎఫ్‌ఎస్‌లో రూ. 125.4 కోట్లు ప్రమోటర్ల వాటాలు విక్రయించడం ద్వారా, రూ. 354.9 కోట్లు ఏపీజే ప్రైవేట్‌ లిమిటెడ్‌, 84.7 కోట్ల రూపాయలు ఏపీజే హౌస్‌ లిమిటెడ్‌, రూ. 34.9 కోట్లు ఇతర మార్గాల్లో సమీకరించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో వివరించింది. సమీకరించిన నిధులను రుణాలు తీర్చేందుకు, ఇతర వ్యాపార వ్యవహారాలకు వినియోగిస్తామని తెలిపింది. ఈ ఆఫర్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్స్‌లు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం కంపెనీ 13 నగరాల్లో హోటల్లను నిర్వహిస్తోంది. ద పార్క్‌ బ్రాండ్‌ కింద కంపెనీ హోటల్స్‌ నడుస్తున్నాయి. పార్క్‌ హోటల్స్‌ ఏపీజే సురేంద్రగ్రూప్‌ కిందకు వస్తాయి. ఈ గ్రూప్‌ షిప్పింగ్‌, టీ, రియల్టీ, రిటైల్‌ బ్రాండ్స్‌, ఎడ్యుకేషన్‌, ఆతిధ్య రంగాల్లో పలు కంపెనీలు నిర్వహిస్తోంది. 



You may be interested

యస్‌బ్యాంక్‌ బాండ్ల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 1st January 2020

యస్‌ బ్యాంక్‌కు చెందిన రూ.21వేల కోట్ల విలువైన బాండ్లపై కేర్‌ రేటింగ్స్‌ సంస్థ నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించింది. ఇటీవల బ్యాంక్‌ నిధుల మూలధన నిధుల సేకరణలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌, లోయర్‌ టైర్‌-II బాం‍డ్లు, టైర్‌ -II బాండ్లు జారీ ద్వారా మొత్తం రూ.16,430.60 కోట్ల సమీకరించింది. కేర్‌ రేటింగ్‌ సంస్థ ఈ బాండ్ల రేటింగ్‌ను ఎ(+) నుంచి ఎ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయించినట్లు

స్వల్ప లాభాలతో కొత్త ఏడాదికి స్వాగతం

Wednesday 1st January 2020

ఆదుకున్న ఐటీ, ఎఫ్‌ఎంసీజీ కొత్త ఏడాది(2020)ని దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో స్వాగతించాయి. బుధవారం సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగి 41,306 వద్ద ముగిసింది. నిఫ్టీ 14 పాయింట్లు పుంజుకుని 12,183 సమీపంలో నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 41,443 వద్ద గరిష్టాన్ని తాకగా.. 41,251 వద్ద కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 12,222-12165 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రపంచ మార్కెట్లన్నీ సెలవుల్లో కొనసాగుతుండటంతో ట్రేడింగ్‌ యాక్టివిటీ తగ్గిపోయినట్లు

Most from this category