News


మార్కెట్లను భయాలు ఆడిస్తున్నాయ్‌!

Tuesday 10th March 2020
Markets_main1583833873.png-32391

ఇకపైనా ఆటుపోట్లు తప్పకపోవచ్చు
పతనానికి అంతెక్కడ అన్నది చెప్పలేం
ఆందోళనలతో అమ్మకాలు కరెక్టు కాదు
- అతుల్‌ సూరి, మారథాన్‌ ట్రెండ్‌ పీఎంఎస్‌ 

ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ల బాటమ్‌ ఎక్కడ అని ఆలోచించడం అవివేకమంటున్నారు మారథాన్‌ ట్రెండ్‌ పీఎంఎస్‌ సీఈవో అతుల్‌ సూరి. మార్కెట్లు స్థిరత్వాన్ని సాధించేవరకూ ఓపిక పట్టవలసి ఉన్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో సూరి వెల్లడించిన అభిప్రాయాలను పరిశీలిద్దాం..

హెడ్జ్‌ ఫండ్స్‌
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లలో ట్రెండ్‌ రివర్స్‌ అవుతుందని భావించడంలేదు. ఇకపై మరిన్ని ఆటుపోట్లకు ఆస్కారం ఉంది. అయితే అప్పుడప్పుడూ షార్ప్‌ రికవరీ కనిపించవచ్చు. ఈ ట్రెండ్‌ పలు రకాల ఆస్తులు(పెట్టుబడులు)లోనూ ప్రతిఫలించే వీలుంది. ఇది ఒక్క ఇండియాలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు అసెట్‌లలో వేగవంతమైన హెచ్చుతగ్గులు నమోదుకావచ్చు. తొలుత ఇది బాండ్ల ఈల్డ్స్‌లో కనిపించింది. తదుపరి ముడిచమురుకూ పాకింది. ఇందుకు తొలుత కరోనా వైరస్‌ కారణమై ఉండవచ్చు. కారణమేదైనాగానీ పునఃసర్దుబాటు తప్పనిసరి. ఈ సర్దుబాటు సాధారణంగా ఉండే అవకాశంలేదు. ఈ అసాధారణ పరిస్థితులకు కారణం భయాలు మాత్రమేకాదు. లాంగ్స్‌ అన్‌వైండింగ్‌, లెవరేజ్‌ ట్రేడ్స్‌ తదితర అంశాలు ప్రభావం చూపుతుంటాయి. ఫలితంగా రెండు వైపులా భారీ ఆటుపోట్లకు ఆస్కారముంటుంది. ఇప్పటికింకా ట్రెండ్‌ మారిపోయినట్లుగా భావించేలేం. అయితే భయాలు, భారీ హెచ్చుతగ్గులకు అవకాశముంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము అమ్మకాలకు ఆసక్తి చూపబోము. ఒకసారి మార్కెట్లు చల్లబడితే(కూలాఫ్‌) మార్కెట్లు తిరిగి వేగంగా జోరందుకుంటాయి. అయితే ఎప్పుడు కూలాఫ్‌ అవుతాయన్నదే అంతుచిక్కని ప్రశ్న!

ఇన్వెస్ట్‌మెంట్‌
నిజానికి మార్కెట్ల పతనాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేపట్టడం తెలివైన నిర్ణయాలుగా చెబుతుంటాం. ప్రస్తుతం కనిపిస్తున్న కల్లోల పరిస్థితుల్లో పెట్టుబడులకంటే అమ్మకాలకే ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం సహజం. మార్కెట్ల బాటమ్‌ను ఎవరూ అంచనా వేయలేరు. ఇంతకంటే మార్కెట్లు స్థిరత్వాన్ని పొందేవరకూ వేచిచూడటం మేలు. తదుపరి పెట్టుబడి నిర్ణయాలను ఆలోచించవచ్చు. చౌకగా లభించినప్పుడు నాణ్యమైన పెట్టుబడులు చేయగలిగితే.. అధిక రివార్డ్స్‌ అందుకోగలుగుతాము. అయితే స్వల్ప కాలంలో మార్కెట్లు అంచనాలకు అందకపోవచ్చు. దీంతో కొంత సమయం వేచి చూడటం వల్ల పరిస్థితులపట్ల అవగాహన ఏర్పడుతుంది.

ఊహించడం కష్టమే
వివధ అసెట్‌ క్లాసెస్‌ మధ్య ఉన్న అనుసంధానత, అల్గోరిథమ్‌ కారణంగా మార్కెట్లు లేదా ముడిచమురు తదితరాలలో తదుపరి ఏం జరగనుందన్న అంశాన్ని అంచనా వేయడం కష్టంగానే ఉంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని అసెట్‌ క్లాసెస్‌కూ వర్తిస్తుంది. దీనికితోడు గ్లోబల్‌ హెడ్జ్‌ ఫండ్స్‌ విభిన్నంగా వ్యవహరిస్తుంటాయి. ఇది కొంత గందరగోళంగానే ఉంటుంది. ఒక ఇన్వెస్టర్‌గా ఆలోచించవలసినదేవిటంటే.. ప్రధానంగా పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడంపై దృష్టిపెట్టవలసి ఉంటుంది. పటిష్ట ఫండమెంటల్స్‌ కలిగిన కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయడంపై దృష్టిపెట్టడం మేలు చేస్తుంది.  You may be interested

10,100–9,850 స్థాయిలో కొనుగోళ్లు మంచివే: మజర్‌ మహమ్మద్‌

Tuesday 10th March 2020

ఇటీవల మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల నేపథ్యంలో ఈక్విటీలతో పాటు పెట్టుబడి సాధనాలుగా భావించే క్రూడాయిల్‌, రూపీలుగా భారీ కూడా పతనాన్ని చూశాయి. టెక్నికల్‌ ఛార్ట్‌లు కొంత ఆందోళనలు కలిగిస్తున్నప్పటికీ..,  ధీర్ఘకాలిక ట్రెండ్‌ అనుకూలంగానే ఉన్నట్లు చతుర్వేది డాట్‌ ఇన్‌ సాంకేతిక నిపుణుడు మజర్‌ మహమ్మద్‌ అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్లఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రస్తుత మార్కెట్‌ తీరుపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.  భారత మార్కెట్‌కు భారీ పతనాలు కొత్తేమీ కాదని, అయితే

ఎస్‌బీఐ రేటింగ్‌ తగ్గించిన హెచ్‌ఎస్‌బీసీ

Tuesday 10th March 2020

టార్గెట్‌ ధర రూ.405 నుంచి రూ.300కు కుదింపు ముంబై:  ‍ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ షేరు రేటింగ్‌ను కుదించింది. యస్‌బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు ఇందుకు కారణమని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. గతంలో తాము ఎస్‌బీఐ షేరుకు కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను ‘‘హోల్డ్‌’’కు సవరించడంతో పాటు షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను రూ.405 నుంచి రూ.300కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. యస్‌బ్యాంక్‌లో 49శాతం వాటాను కొనుగోలు చేయనున్న

Most from this category