News


కొత్త ఏడాది బాగుంటుంది!

Monday 7th January 2019
Markets_main1546849090.png-23449

సమీర్‌ ఆరోరా అంచనా
మధ్యమధ్య కొన్ని వారాలు ఆటుపోట్లు కనిపించినా మొత్తం మీద కొత్త ఏడాది మార్కెట్లు బాగుంటాయని మార్కెట్‌ అనలిస్టు సమీర్‌ ఆరోరా అభిప్రాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా మార్కెట్లు మరింత బాగుండొచ్చన్నారు. గతేడాది తలనొప్పులు తెచ్చిన పలు అంశాలు ఈ ఏడాది క్రమంగా సమసిపోతున్నాయన్నారు. ఎర్నింగ్స్‌ ఒడదుడుకులు, మిడ్‌క్యాప్‌ కరెక‌్షన్‌, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, కరెన్సీ పతనం తదితర అంశాలు గతేడాది మార్కెట‍్లను కుంగదీశాయన్నారు. అయితే గత రెండు మూడు నెలలుగా పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ముడి చమురు ధర అనూహ్యంగా పడిపోవడంతో చాలా ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. ఇదే సమయంలో రూపీ మరలా బలపడడం, ఎఫ్‌పీఐలు క్రమంగా కొనుగోళ్లు ఆరంభించడం జరిగిందన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉండడంతో రేట్‌కట్‌ ఆశలు మొదలయ్యాయని తెలిపారు. వచ్చే కొన్ని నెలలు రాజకీయ అనిశ్చితి ఉంటుందని, తదనంతరం పరిస్థితి చక్కబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా మార్కెట్లు భారీగా కదలికలు చూపకపోవచ్చని అరోరా అంచనావేశారు. మరీ ఊహించని ప్రధాని వస్తే తప్ప సూచీలు 5 శాతం ప్లస్‌ ఆర్‌ మైనస్‌ కదలికలు చూపుతాయన్నారు. 2004,2009లో జరిగినట్లు 20 శాతం కదలికలకు ఛాన్స్‌ ఉండదని అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాదికి 65- 35 లాంగ్‌, షార్ట్‌ నిష్పత్తిలో పొజిషన్లు ఉంచుకోవాలని ఆయన సూచించారు. స్వల్పకాలిక ధృక్పధంతో షార్ట్స్‌, దీర్ఘకాలిక దృష్టిలో లాంగ్స్‌ను తీసుకోవాలన్నారు. తమ పోర్టుఫోలియో సైతం దాదాపు ఇలాగే ఉంటుందన్నారు. You may be interested

ఫండ్‌ రివ్యూ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌

Monday 7th January 2019

పన్ను ఆదా కోసం ఎన్నో పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎఫ్‌డీలు, ఈల్‌ఎస్‌ఎస్‌ తదితర పథకాలు ఇందుకు ఉపయోగపడతాయి. వీటిల్లో ఈక్విటీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించేవి ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు అవకాశాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లో పెట్టుబడుల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఒకవైపు పన్ను ఆదా, మరోవైపు ఈక్విటీల్లో దీర్ఘకాలంలో అధిక రాబడులు... రెండు రకాల ప్రయోజనాలు

సిప్‌ ఆపేస్తారా?

Monday 7th January 2019

- సిప్‌ పెట్టుబడులపై సందేహాలే అనవసరం - ఓర్పుగా ఉంటే లాభాలు అందుకోవచ్చు – దీర్ఘకాలిక వ్యూహంతోనే పెట్టుబడి పెట్టాలి నాలుగేళ్లుగా.. సిప్‌ మార్గంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన రిటైల్‌ ఇన్వెస్టర్లకు బాగానే ఉంది. కానీ ఇటీవల మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వారిని కలవరపెడుతోంది. పెట్టుబడులపై పునరాలోచనల్లో పడేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిప్‌ను ఇంకా కొనసాగించాలా? లేదా మార్కెట్లు చక్కబడే వరకూ ఆపేయాలా? అనేది వారి సందేహం. మన పెట్టుబడులపై రాబడులు రాకపోగా..

Most from this category