News


ఈ ఏడాది వెనుకడుగే!

Friday 18th January 2019
Markets_main1547802948.png-23668

భారత మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ అంచనా
వచ్చే ఆరునెలల్లో దేశీయ మార్కెట్లలో నిధుల ప్రవాహం సన్నగిల్లుతుందని, అందువల్ల మార్కెట్లు మందకొడిగా తయారవుతాయని సీఎల్‌ఎస్‌ఏ వ్యూహకర్త మహేశ్‌ నండూర్కర్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈక్విటీలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయ మార్కెట్లలో 8- 10 శాతం పతనం వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయన్నారు. ఈ ఏడాదిని నిఫ్టీ పాజిటివ్‌గా ముగిస్తే సంతోషించాల్సినవిషయమని, ఈ సంవత్సరం ఎలాగైనా సూచీల్లో డౌన్‌ట్రెండ్‌ తప్పకపోవచ్చని ఆయన చెప్పారు.బడ్జెట్‌ కాకుండా మార్కెట్‌పై ఒత్తిడి పెంచే అంశాలు అనేకమున్నాయన్నారు. వర్ధమాన మార్కెట్లలో భారత మార్కెట్‌ ఒక్కటే గతసంవత్సరాల సరాసరి పీఈ కన్నా చాలా ఎక్కువ పీఈ వద్ద ట్రేడవుతోందని ఆయన వివరించారు. ఇంతవరకు దేశీయంగా నిధుల ప్రవాహం బాగుండడంతో మార్కెట్లల వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నా ముందుకే పరుగు కొనసాగిందని చెప్పారు. అయితే ఇకపై ఈ నిధుల ప్రవాహం సన్నగిల్లుతోందని, రాబోయే ఆరు నెలల్లో దేశీయ ఈక్విటీ పెట్టుబడులు మరింత తగ్గుతాయని ఆయన తెలిపారు. అందువల్ల మార్కెట్లలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు
ఎఫ్‌ఐఐలు వెనకాడుతున్నాయి
గత ఏడాది కాలంలో దేశీయ మార్కెట్లలో డీఐఐలు దాదాపు 1.1 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులే మార్కెట్‌ను పతనం కాకుండా ఆదుకున్నాయి. కానీ ఈ నిధుల రాక క్రమంగా తగ్గుతోంది. మరోవైపు ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లపై తమ వెయిటేజ్‌ను తగ్గించుకుంటున్నాయని మహేశ్‌ తెలిపారు. ఇతర దేశాల్లోని మార్కెట్లలో తక్కువ ధరలకే షేర్లు లభిస్తుండగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏముందని ఎఫ్‌పీఐలు భావిస్తున్నాయన్నారు. వచ్చే ఆరునెలల్లో ఎఫ్‌ఐఐల ప్రవాహం పెరిగే సూచనలేమీ లేవని తెలిపారు. ఒకవేళ డాలర్‌ బలహీనపడితే అప్పుడు మరలా ఇండియాపై విదేశీమదుపరుల కన్ను పడుతుందన్నారు. మార్కెట్లను గట్టిగా ప్రభావితం చేసే స్థాయి ప్రస్తుతం బడ్జెట్‌కు లేదని ఆయన చెప్పారు. దీనికితోడు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు పెద్ద ప్రాధాన్యముండదని తెలిపారు. ఈ దఫా బడ్జెట్లో పేదరిక నిర్మూలనకు లేదా రైతు సహాయానికి చర్యలు ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. 

 You may be interested

నెలన్నర గరిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.!

Friday 18th January 2019

మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి మూడో క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నెలన్నర గరిష్టాన్ని తాకింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ షేర్లు రూ.1,148.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నటి మార్కెట్‌ ముగింపు వెల్లడించిన క్యూ3 ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే షేర్లు లాభాల బాట పట్టాయి. ఇంట్రాడేలో ఒకానొక దశలో దాదాపు 5శాతం లాభపడి రూ.1,189.90ల గరిష్టాన్ని తాకింది. నవంబర్‌ 30వ తేదీ

తగ్గిన సన్‌ టీవీ వెలుగులు

Friday 18th January 2019

మీడియా షేర్ల పతనంలో భాగంగా సన్‌టీవీ షేర్లు శుక్రవారం ఏడాది కనిష్టానికి నష్టపోయాయి. నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో సన్‌టీవీ షేర్లు రూ.567.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో షార్ట్‌ సెల్లింగ్‌తో షేరు ఒక్కసారిగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకానొకదశలో 9శాతం నష్టపోయి రూ.513.75ల కనిష్టానికి చేరుకుంది. ఇది ఈ షేరుకు ఏడాది కనిష్టస్థాయికి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.567.30)తో పోలిస్తే 7.50శాతం నష్టపోయి రూ.525.00ల వద్ద

Most from this category