STOCKS

News


బడ్జెట్‌ వేళ ఆప్షన్‌ వ్యూహాలు!

Friday 31st January 2020
Markets_main1580444908.png-31359

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈదఫా నూతనంగా శనివారం బడ్జెట్‌ రోజున ట్రేడింగ్‌ జరపనున్నాయి. బడ్జెట్‌ రోజు సూచీల్లో ఆటుపోట్లు అధికంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్‌ ప్లేయర్లు బడ్జెట్‌ రోజున అవలంబించాల్సిన కొన్ని వ్యూహాలను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి...
1. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: నిఫ్టీ రాబోయే వారాల్లో 12500 పాయింట్ల దిశగా కదలవచ్చు. ఈ సమయంలో కాల్‌ రేషియో వ్యూహం అవలంబించడం ద్వారా లాభం పొందొచ్చు. ఇందులో ఫిబ్రవరి నిఫ్టీ 12100 కాల్‌ ఒకలాట్‌(లాట్‌లో 75 షేర్లుంటాయి)ను రూ. 180- 185 రేంజ్‌లో కొని, 12500 ఫిబ్రవరి కాల్‌ రెండు లాట్లను రూ. 50-55 రేంజ్‌లో విక్రయించాలి. నిఫ్టీ పతనమైతే వచ్చే గరిష్ఠ నష్టం రూ. 75 పర్‌ షేర్‌ ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ 12500ను దాటితే గరిష్ఠంగా షేరుకు రూ. 325 వరకు లాభం వస్తుంది. నిఫ్టీ 12825 పాయింట్లకు చేరేవరకు ఈ వ్యూహం సత్ఫలితాలనే ఇస్తుంది. 
2. మోతీలాల్‌ ఓస్వాల్‌: నిఫ్టీ మధ్యకాలానికి బుల్లిష్‌గా ఉండి 12500- 12600 పాయింట్ల వరకు ర్యాలీ జరవవచ్చనుకుంటే బుల్‌ కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం పాటించాలి. ఇందులో ఫిబ్రవరి నిఫ్టీ కాల్‌ 12200 లాట్‌ను రూ. 140 వద్ద కొని, ఒక లాట్‌ 12500 కాల్‌ను రూ. 50 వద్ద విక్రయించాలి. ఈ వ్యూహానికి బ్రేక్‌ ఈవెన్‌ పాయింటు 12291 పాయింట్లు. ఒకవేళ నిఫ్టీ బేరిష్‌గా ఉంటుందని భావిస్తే బేర్‌పుట్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించాలి. ఇందులో 12000 ఫిబ్రవరి పుట్‌ రూ. 199 వద్ద ఒకలాట్‌ కొని 11700 పుట్‌ ఒకలాట్‌ను రూ. 98 వద్ద విక్రయించాలి. ఈ వ్యూహంలో బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ 11899 పాయింట్లు. 
3. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌: బడ్జెట్‌ సమయంలో బుల్‌ కాల్‌ లాడర్‌ వ్యూహం మంచిది. ఇందులో 12100 ఫిబ్రవరి6న ఎక్స్‌పైరీ అయ్యే కాల్‌ ఒకలాట్‌ను రూ. 120 వద్ద కొని 12300, 12500 కాల్స్‌ను రూ. 52, 21 వద్ద విక్రయించాలి. నిఫ్టీ 12653 పాయింట్లపైకి వస్తే లాభం రూ. 12653 వరకు ఉంటుంది. నిఫ్టీ 12147 దిగువకు వస్తే గరిష్ఠంగా రూ. 3500 వరకు నష్టం వస్తుంది. 



You may be interested

ఎల్‌ఐసీ హౌసింగ్‌పై కేటాయింపుల ప్రభావం

Friday 31st January 2020

రూ.602 కోట్లకు తగ్గిన నికర లాభం  నికర వడ్డీ ఆదాయం 18 శాతం అప్‌ ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో స్వల్పంగా తగ్గంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.607 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఈ క్యూ3లో రూ.602 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ సిద్ధారథ మొహంతి తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.4,466 కోట్ల నుంచి

యాంఫీ ప్రచార కర్తలుగా సచిన్‌, ధోని

Friday 31st January 2020

‘మ్యూచువల్ ఫండ్స్ సాహి హై’ క్యాంపైన్‌కు ప్రచారం న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా లెజండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు ‘మ్యూచువల్ ఫండ్స్ సహి హై’ క్యాంపైన్‌కు ప్రచారం చేయనున్నారని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా(యాంఫీ) ప్రకటించింది. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం.. ఈ క్యాంపైన్‌కు తొలిసారిగా క్రికెటర్లను ఎంపికచేసినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు పూర్తిచేసినట్లు చైర్మన్ నీలేష్

Most from this category