STOCKS

News


11750- 12200 రేంజ్‌లో నిఫ్టీ!

Tuesday 12th November 2019
Markets_main1573534160.png-29526

నవంబర్‌ సీరిస్‌పై చందన్‌ తపారియా అంచనా
దేశీయ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో ఎక్కువసమయం నెగిటివ్‌జోన్‌లోనే గడిపాయి. కానీ మధ్యాహ్న అనంతరం నిఫ్టీ 11850 పాయింట్ల వద్ద మద్దతు పొంది రికవరీ సాధించి 11900 పాయింట్లపైన పాజిటివ్‌గా ముగిసింది. డైలీ చార్టుల్లో నిఫ్టీ సందిగ్దతను ప్రదర్శిస్తోంది. గత ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ 11850 పాయింట్ల వద్ద మద్దతు పొందుతూ వస్తోంది. ఇదే కొనసాగినంత కాలం తక్షణ ప్రమాదం ఉండకపోవచ్చు. తదుపరి నిఫ్టీకి 12035, 12103 పాయింట్ల వద్ద నిరోధాలుంటాయి. దిగువన 11780- 11750 పాయింట్ల జోన్‌ పటిష్ట మద్దతునిస్తుంది. ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. నిఫ్టీ నెలవారీ ఆప్షన్స్‌ పరిశీలిస్తే 11600, 11500 పాయింట్ల వద్ద పుట్స్‌ అత్యధికంగా , 12000, 11800 పాయింట్ల వద్ద కాల్స్‌ అత్యధికంగా ఉన్నాయి. కొత్త కాల్‌ రైటింగ్‌ 12200, 12300 పాయింట్ల వద్ద కనిపించింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ నవంబర్‌ సీరిస్‌కు 11750- 12200 పాయింట్ల మధ్య కదలాడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇండియా వీఐఎక్స్‌ సోమవారం 16.25కు పెరిగింది. ఇది 17 దాటితే మార్కెట్లో అమ్మకాలు పెరగవచ్చు. బ్యాంకు నిఫ్టీ ప్రధాన సూచీలను మించి ప్రదర్శన జరిపి నాలుగు నెలల గరిష్ఠాన్ని చేరింది. చార్టుల్లో బ్యాంకు నిఫ్టీ బుల్లిష్‌గా మారింది. తదుపరి టార్గెట్‌ 31500 పాయింట్ల వరకు బ్యాంకు నిఫ్టీ పెరగవచ్చు. దిగువన 30800 పాయింట్ల వద్ద మద్దతుంది. షేర్లలో అమర్‌రాజా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌, జిందాల్‌ స్టీల్‌ కౌంటర్లలో లాంగ్స్‌, ఈక్విటాస్‌, ఇండిగో, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, సిప్లా, పిడిలైట్‌ కౌంటర్లలో షార్ట్‌ పొజిషన్లు పెరిగాయి. 



You may be interested

మరింత తగ్గిన పసిడి

Tuesday 12th November 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర మంగళవారం 3నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప నష్టంతో 1,456.80 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనాతో వాణిజ్య చర్చల్లో భాగంగా తొలి దశ ఒప్పందంపై ట్రంప్‌ స్పష్టమైన వైఖరి కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అయితే హాంగ్‌కాంగ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు పసిడి కొంత మద్దతునిస్తున్నాయి. అమెరికా మార్కెటు నిన్నరాత్రి రికార్డు

ఎన్‌ఎండీసీ లాభం 10 శాతం జంప్‌

Tuesday 12th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ సెప్టెంబరు త్రైమాసికంలో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.53 శాతం పెరిగి రూ.703 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.2,438 కోట్ల నుంచి రూ.2,242 కోట్లకు చేరింది. ముడి ఖనిజం విక్రయాలు 6.7 మిలియన్‌ టన్నుల నుంచి 5.82 టన్నులకు తగ్గాయి.

Most from this category