News


భారత మార్కెట్లపై జేఎం ఫైనాన్షియల్‌ పాజిటివ్‌

Tuesday 15th January 2019
Markets_main1547546920.png-23606

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దేశీయ మార్కెట్లు మంచి ప్రదర్శన చూపుతాయని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతమ్‌ షా అంచనా వేశారు. గత డిసెంబర్‌లో మార్కెట్లను వెనక్కు లాగేందుకు పలు శక్తులు కాచుకుని ఉన్నాయని, కానీ దేశీయ మార్కెట్లు వాటిని ఎదుర్కొని స్థిరంగా నిలబడ్డాయని చెప్పారు. వర్దమాన మార్కెట్లలో భారత మార్కెట్‌ మంచి పనితీరు కనబరుస్తోందని, రాబోయే రోజుల్లో ఇదే జోరు కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం నిఫ్టీ 10650- 10950 పాయింట్ల రేంజ్‌లో కొనసాగుతూ వస్తోంది. బ్యాంకులు, మిడ్‌క్యాప్స్‌ గట్టిగా నిల్చుంటున్నాయని, అంతర్జాతీయంగా కూడా ఒడిదుడుకులు కాస్త చల్లబడుతున్నాయని షా చెప్పారు. ఇవన్నీ పరిశీలిస్తుంటే రాబోయే రోజుల్లో నిఫ్టీ మరో 400- 500 పాయింట్ల మేర ర్యాలీ జరపవచ్చని ఆయన అంచనా వేశారు. 10950 పాయింట్ల నిరోధం దాటితే నిఫ్టీ పరుగు తీస్తుందన్నారు. ఈ సందర్భంలో 11300 పాయింట్లను చేరేందుకు ఛాన్సులుంటాయని చెప్పారు. క్రూడ్‌, కరెన్సీ, క్యాష్‌ అంశాలు మార్కెట్లను స్థిరంగా ఉంచాయని చెప్పారు. అందువల్ల కొన్ని నెలలుగా లేని జోరు మరలా మార్కెట్లో కనిపించవచ్చన్నారు. రంగాలవారీగా మెటల్‌ ఇండెక్స్‌ లోయర్‌టాప్స్‌, లోయర్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తూ బలహీనంగా కనిపిస్తోందని చెప్పారు. బ్యాంకులతో పాటు క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో రంగాలు రాబోయే రోజుల్లో మంచి పనితీరు కనబరచవచ్చని అంచనా వేశారు. 



You may be interested

10850 పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ

Tuesday 15th January 2019

465 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ పటిష్టమైన ఆర్థిక గణాంకాల నమోదుతో మార్కెట్‌ మూడురోజుల నష్టాలకు మంగళవారం బ్రేక్‌ పడింది. డిసెంబర్‌లో టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బం తగ్గుముఖం పట్టడంతో రానున్న రోజుల్లో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోతకు అవకాశం ఉండవచ్చనే అంచనాలు సూచీలను పరుగులు పెట్టించాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ తిరిగి 71స్థాయిని అందుకోవడం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌,

కొత్త సీఈవో వార్తలతో యస్‌ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ

Tuesday 15th January 2019

బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో) పదవి పోటీలో డాయిష్‌ బ్యాంకు సీఈవో రవ్నీత్‌ గిల్‌ ముందంజలో ఉన్నారనే వార్తలతో మంగళవారం యస్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా ర్యాలీ చేస్తున్నాయి. నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేర్లు రూ.196.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రస్తుత యస్‌ బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ పదవీకాలం జనవరి 31న ముగియనున్న నేపథ్యంలో రవ్నీత్‌ గిల్‌తో పాటు యస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌ రాజత్‌

Most from this category