News


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనేందుకిదే సమయం!

Wednesday 19th June 2019
Markets_main1560936881.png-26419

నిపుణుల సలహా
హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ షేరు మంగళ, బుధవారాల్లో దాదాపు 8 శాతం మేర పతనమైంది. మంగళవారం షేరు తొమి‍్మదినెలల్లో ఎన్నడూ లేని ఇంట్రాడే పతనాన్ని నమోదు చేసింది. ఎస్సెల్‌ గ్రూప్‌ డెట్‌ సెక్యూరిటీస్‌ను తన పథకాల్లోకి తీసుకోవాలన్న ఏఎంసీ నిర్ణయం మదుపరులకు రుచించలేదు. దీంతో కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అయితే ఈ పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశీయ ప్రజలు బంగారం, రియల్టీలో పొదుపు చేసే అలవాటు నుంచి క్రమంగా ఈక్విటీలు, బాండ్లవైపు మరలుతున్న నేపథ్యంలో ఏఎంసీ కంపెనీలకు మంచి భవిష్యత్‌ ఉంటుందంటున్నారు. బుధవారం మధ్యాహ్న ట్రేడింగ్‌లో ఏఎంసీ షేరు రూ. 1788 వద్ద ట్రేడవుతోంది. ఎస్సెల్‌గ్రూప్‌ బాండ్స్‌ను కొనడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సదరు బాండ్‌ ఇన్వెస్టర్లను కాపాడేందుకు యత్నిస్తోందని, అది కూడా తన సొంత షేర్‌ హోల్డర్ల ప్రయోజనాలను పణంగా పెట్టి ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ వర్గాలు భావించాయి. అయితే బడా బ్రోకరేజ్‌లు మాత్రం సంస్థపై పాజిటివ్‌ ధృక్పథాన్నే కలిగిఉన్నాయి. ఉదాహరణకు కంపెనీకి ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను రూ. 2000 టార్గెట్‌ను ఇచ్చినట్లు మోర్గాన్‌స్టాన్లీ ప్రకటించింది. భవిష్యత్‌లో పెద్ద ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఏఎంసీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, ఈ బాండ్లపై ఎస్సెల్‌గ్రూప్‌ అనుకున్నసమయానికి మెచ్యూరిటీ నగదు చెల్లించకపోతే జూన్‌త్రైమాసికంలోనే వీటికి కేటాయింపులు జరపవచ్చని ఏఎంసీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంచనాలున్నాయి. ఒకవేళ ఎస్సెల్‌గ్రూప్‌ అనుకున్నట్లు పైకం చెల్లిస్తే ఈ ప్రొవిజన్లను రివర్స్‌ చేస్తారని అంచనా. ఈ నిర్ణయం స్వల్పకాలానికి ఇబ్బంది పెట్టినా, దీర్ఘకాలానికి మేలు చేస్తుందని కొందరి భావన. ఈ చర్య ద్వారా ఇన్వెస్టర్లలో విశ్వాసం పొందుతుందని రినైసెన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ అభిప్రాయపడింది. గత మూడు నెలల్లో ఏఎంసీ షేరు దాదాపు 21 శాతం లాభపడింది. ఐపీఓ ధర కన్నా దాదాపు 60 శాతం లాభంతో ట్రేడవుతోంది.  



You may be interested

ఎస్‌బీఐకి ప్రాధాన్యం ఇచ్చిన నోముర

Wednesday 19th June 2019

ప్రైవేట్‌ దిగ్గజాలైనా యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కం‍టే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) కి ప్రాధాన్యాన్ని ఇస్తానని జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోముర తెలిపింది. ‘ ఎస్‌బీఐ అభివృద్ధి కారకాలు, మార్జిన్‌ల పెరుగుదల, ఈక్విటీలపై లాభాలలో మెరుగుదల కనిపిస్తోంది. అంతేకాకుండా సంస్థ ఆస్థి నాణ్యత సమస్యలు కూడా తగ్గాయి’ అని​వివరించింది. దీంతో పాటు ఎస్‌బీఐ 2020-22 ఆర్థిక కాలం ఈపీఎస్‌ అంచనాలను 5 శాతం పెంచింది. ఎస్‌బీఐ షేరు

మార్కెట్‌ నుంచి బయటపడండి.. ఇదే సరైన సమయం!

Wednesday 19th June 2019

ఎస్‌బీఐ లైఫ్‌ సీఐఓ గోపీకృష్ణ షెనాయ్‌ ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్‌లో లాభాల స్వీకరణ జరిపి బయటపడడం మంచిదని ఎస్‌బీఐ లైఫ్‌ సీఐఓ గోపీకృష్ణ షెనాయ్‌ సూచిస్తున్నారు. వాల్యూషన్లు బాగా వ్యాకోచించాయని, ఈ నేపథ్యంలో ఈక్విటీల నుంచి బయటకు రావడం ఉత్తమమని ఆయన చెప్పారు. గతేడాది దేశీయ సూచీలు పదిశాతం ర్యాలీ జరిపాయి. ఈ ఏడాది కూడా జోరు చూపుతున్నాయి. అయితే ఎర్నింగ్స్‌ గ్రోత్‌ బాగుంటుందని చెప్పే సరైన తక్షణ సూచికలేమీ లేవని,

Most from this category