News


యస్‌ బ్యాంక్‌ రుణగ్రహిత డిఫాల్ట్‌

Tuesday 2nd July 2019
Markets_main1562050069.png-26729

ఎన్‌బీఎఫ్‌సీ రంగం సమస్యల్లో ఉండడంతో పాటు ఆర్థిక మందగమనం కారణానా యస్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న  రూ.1200 కోట్ల రుణాలపై వడ్డీలను  రేడియస్‌ డెవలపర్స్‌ సంస్థ షెడ్యుల్‌ సమయంలో చెల్లించలేకపోయింది.  బ్యాంకులు ప్రకటించిన ప్రమాదకర రుణాలు రూ. 5,500 కోట్లపై వడ్డీలను తీర్చడంలో ఈ కంపెనీ గత 45-60 రోజులుగా ఆలస్యం చేసింది. ‘రూ. 30 కోట్ల వడ్డి చెల్లింపులు ఆలస్యం చేయడంతో రేడియస్‌ డెవలపర్స్‌ ఖాతా ఎస్‌ఎమ్‌ఏ 2 విభాగంలో ఉంది’ అని పరిశీలకులంటున్నారు. జులై 5 కల్లా రూ.30 కోట్ల వడ్డి చెల్లింపులను బ్యాంకుకు చెల్లిస్తుందని రేడియస్‌ మీడియా ప్రతినిధి తెలిపారు.

   ముంబై సబర్బన్‌కు నార్త్‌ ఈస్ట్‌లో చెంబుర్‌ వద్ద రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు కోసం రేడియస్‌ కంపెనీ యస్‌ బ్యాంక్‌ నుంచి రుణాన్ని పొందింది. వాతవరణ అనుమతులు కారణాన ఈ ప్రాజెక్టు నాలుగేళ్లు ఆలస్యం కావడంతో ప్రాజెక్టులో కొంత భాగాన్ని రూ.360 కోట్లకు  విక్రయించడానికి ప్రముఖ ఎన్‌బీఎఫసీతో  ఎగ్రిమెంట్‌ను కుదుర్చుకుంది. కానీ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత ఈ ఎగ్రిమెంట్‌ రద్దయ్యింది. 
        ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీ గ్రూప్‌ రుణాల చెల్లింపులో విఫలమయ్యాక ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో వాణిజ్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. భారత ఎన్‌బీఎఫ్‌సీ రంగం విడుదల చేసే అధిక రేటింగ్‌ కలిగిన ఐదేళ్ల బాండులు 70 బేసిస్‌ పాయింట్లకు పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజమైన పిరమిల్‌ గ్రూప్‌ కూడా సమస్యలను ఎదుర్కొంటుంది. డెవలపర్‌లు ఏడాదికి రూ.1.29 లక్షల కోట్ల అప్పులను చెల్లించాలి కానీ ఆదాయం మాత్రం ఇందులో సగం మాత్రమే పుడుతోందని 11,000 కంపెనీలను విశ్లేషించిన రిసెర్చ్‌ సంస్థ లియాసెస్‌ పోరస్‌ ప్రకటించింది. 
యస్‌ బ్యాంక్‌ షేరు మధ్యాహ్నం 12.09 సమయానికి 6.55 శాతం నష్టంతో రూ.102 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

పుంజుకుంటున్న పసిడి

Tuesday 2nd July 2019

ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు, యూరప్‌- అమెరికాల ట్రేడ్‌ వార్‌ అంశాలు మళ్లీ తెరపైకి రావడంతో మం‍గళవారం పసిడి ధర తిరిగి పుంజుకుంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 7డాలర్లు లాభపడి 1,396.05డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధ చర్చల నేపథ్యంలో ఈ జూన్‌లో ఆసియాలో పలుదేశాల మాన్యూఫ్చాక్చరింగ్‌ యాక్టివిటీ గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదుకాగా, అమెరికాలో అయితే ఈ

లాభాల్లోంచి నష్టాలోకి మార్కెట్‌...

Tuesday 2nd July 2019

స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.., తిరిగి నష్టాల్లోకి మళ్లింది. ప్రపంచమార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వాతావరణం, దేశీయ ఆర్థిక వ్యవస్థలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు సూచీలను నష్టాల్లోకి మళ్లేందుకు కారణమయ్యాయి. నేడు నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,892.70వద్ద, సెన్సెక్స్‌ 126 పాయింట్ల లాభంతో 39,811.68 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి.  దేశీయంగా నిన్న పలు వాహన కంపెనీలు జూన్‌ మాసపు విక్రయ గణాంకాలను విడుదల చేశాయి. వరుసగా 3వ నెలలో

Most from this category