News


ఓఎంసీ షేర్ల పట్ల విశ్లేషకుల సానుకూలత

Wednesday 25th September 2019
Markets_main1569434235.png-28549

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల (ఓఎంసీలు) పట్ల అనలిస్టులు సానుకూలంగా ఉన్నారు. ప్రభుత్వరంగంలోని ఏఎంసీలు బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ గత నెల రోజుల్లో వాటి కనిష్ట ధరల నుంచి ర్యాలీ చేశాయి. ప్రధానంగా చమురు ధరలు శాంతించడం వీటి ర్యాలీకి దోహదపడింది. వీటిల్లో బీపీసీఎల్‌ బాగా లాభపడింది. నెల క్రితం రూ.321 ధర నుంచి ప్రస్తుతం రూ.465కు చేరింది. ఒకవైపు చమురు ధరల తగ్గుదల, మరోవైపు ఈ కంపెనీలో తనకున్న పెట్టుబడులను ప్రభుత్వం వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించి బయటకు వెళ్లిపోనున్నట్టు వార్తలు రావడం కలిసొచ్చింది. ఇక ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హెచ్‌పీసీఎల్‌ 20 శాతం వరకు గడిచిన నెల రోజుల్లో పెరిగాయి. అయినప్పటికీ ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌ వాటి 52 వారాల గరిష్ట ధరకు దిగువనే ట్రేడ్‌ అవుతున్నాయి. 

 

ఓఎంసీ షేర్ల పట్ల చాలా మంది విశ్లేషకులు బుల్లిష్‌గా ఉన్నారు. చమురు ధరలు తగ్గడం వీటి లాభదాయకతను పెంచుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఓఎంసీలకు ఉన్న నిర్మాణాత్మక సానుకూల కొనసాగుతుందని తాము భావిస్తున్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా తెలిపారు. ‘‘చమురు ధరలు పెరిగినప్పుడు ఓఎఎంసీల లాభదాయక ప్రభావితం అవుతుంది. కానీ, చమురు ధరలు ఇటీవల శాంతించాయి. స్టాక్స్‌ ధరలు కనిష్ట స్థాయికి రావడంతో విలువ పరంగా అవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. పైగా ఈ స్టాక్స్‌లో మంచి డివిడెండ్‌ రాబడి కూడా ఉంది’’అని సిద్ధార్థ వివరించారు.  

 

‘‘రిటైల్‌ ధరలు పెరుగుతూ వెళుతున్నాయి. కానీ, చమురు ధరలు కూడా పెరుగుతాయని మేం భావించడం లేదు. దీంతో ఓఎంసీల మార్జిన్‌ పెంచుకునేందుకు మంచి అవకాశం’’ అని సింఘి అడ్వైజర్స్‌ ఎండీ మహేష్‌ సింఘి తెలిపారు. ఈ స్టాక్స్‌ పట్ల తాను సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. కొన్ని సానుకూల నిర్ణయాలు ఓఎంసీలకు తోడ్పడినట్టు సిద్ధార్థ తెలిపారు. సబ్సిడీ భారాన్ని ఓఎంసీలు కూడా పంచుకోవాలనే ప్రణాళిక విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లకపోవడం ఓఎంసీలకు మేలు చేసిందనన్నారు. చమురు ధరల్లో అస్థిరతల ప్రభావం ఓఎంసీలపై కచ్చితంగా ఉంటుందని సిద్ధార్థ చెప్పారు. కనుక చమురు ధరలు, కరెన్సీ విలువ కదలికల రిస్క్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత దీర్ఘకాలం కోసం వీటిని ఎంచుకోవచ్చని సూచించారు. You may be interested

అక్టోబర్‌ తర్వాత బ్రహ్మాండమైన ర్యాలీ: భాసిన్‌

Wednesday 25th September 2019

అక్టోబర్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లలో అద్భుతైమన ర్యాలీ చూడనున్నామని పేర్కొన్నారు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. గత కొంత కాలంగా తక్కువ ధరల్లో కొనుగోలు చేయలేకపోయామనుకున్న స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రస్తుతం మంచి  తరుణంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.    మార్కెట్లు 1,000 పాయింట్లు పెరిగిన తర్వాత 200 పాయింట్లు పడిపోవడం సహజమేనన్నారు భాసిన్‌. కానీ, ర్యాలీకి ఇది ఆరంభమేనన్నారు. ప్రభుత్వం తీసుకున్న

సెన్సెక్స్‌ 500 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు డౌన్‌

Wednesday 25th September 2019

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు లాభాల స్వీకరణ జతకలవడంతో బుధవారం దేశీయ మార్కెట్‌ భారీ నష్టాలతో ముగిసింది. రేపు సెప్టెంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ఫలితంగా సెనెక్స్‌ 3రోజుల వరుస లాభాలకు ముగింపు పలుకుతూ 503 పాయింట్ల నష్టంతో 38593.52 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 148 పాయింట్లు నష్టపోయి 11450 దిగువున 11,440.20 వద్ద ముగిసింది. ఈ నెలలో నిఫ్టీ సూచీకిది రెండో

Most from this category