News


1500డాలర్లపైన ముగిసిన పసిడి

Wednesday 25th December 2019
news_main1577253004.png-30426

ఏడు వారాల అనంతరం పసిడి ఫ్యూచర్ల ధర 1500డాలర్లపైన ముగిసింది. అమెరికాలో నిన్నరాత్రి ఫిబ్రవరి కాంటాక్టు ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ 16.10 డాలర్లు లాభపడి 1,504.80 వద్ద స్థిరపడింది. ఆర్థిక మాంద్య భయాలు వెంటాడటంతో పాటు ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ తరుణంలో లాభాల స్వీకరణ జరగవచ్చనే అందోళనలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచినట్లు బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. 

‘‘ ఈక్విటీ సూచీలు గరిష్ట స్థాయి వద్ద ఉన్నాయి. మార్కెట్‌ ర్యాలీ ఎల్లకాలం కొనసాగదు. జనవరి ప్రారంభం నుంచి ఈక్విటీ మార్కెట్‌ కరెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో రక్షణాత్మక సాధనమైనమై పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరిగింది.’’ అని ఈడి అండ్ ఎఫ్ మ్యాన్ క్యాపిటల్ మార్కెట్స్ విశ్లేషకుడు ఎడ్వర్డ్ మీర్ అభిప్రాయపడ్డారు 

అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ మంగళవారం వాణిజ్య చర్చలపై అంశం కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య చర్చల్లో భాగంగా ఇటీవల చైనాతో కుదుర్చుకున్న మొదట దశ ఒప్పంద పత్రాలపై చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్‌ కలిసి త్వరలో సంతకాలు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పసిడి కొంత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. 

దేశీయ మార్కెట్లో స్వల్ప లాభమే:- 
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు భారీగా లాభపడినప్పటికీ.., దేశీయంగా మాత్రం స్వల్పంగా పెరిగాయి. మంగళవారం మార్కెట్‌ ముగిసే సరికి ఎంసీఎక్స్‌లో 10గ్రాముల పసిడి ధర రూ. 166.00లు లాభంతో రూ.38423.00 వద్ద స్థిరపడింది. 



You may be interested

వచ్చే ఏడాది మిడ్‌ క్యాప్స్‌ హవా: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

Wednesday 25th December 2019

నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌కు డిమాండ్‌  భారీ హెచ్చుతగ్గులకు ఆస్కారం తక్కువే రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌: నవీన్‌ కులకర్ణి వచ్చే ఏడాది(2020)లో మధ్య, చిన్నతరహా కౌంటర్లు వెలుగులో నిలిచే వీలున్నట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి చెబుతున్నారు. అయితే స్మాల్‌ క్యాప్స్‌తో పోలిస్తే మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ త్వరగా జోరందుకోనున్నట్లు అంచనా వేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2020లో మార్కెట్ల గమనం, విభిన్న రంగాల తీరు తదితర

ఒప్పందంపై త్వరలో సంతకాలు: ట్రంప్‌

Wednesday 25th December 2019

చైనాతో ప్రాథమిక దశ వాణిజ్య ఒప్పందం ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వివాదాలకు చెక్‌ ఏడాదిన్నర కాలంగా చైనాతో కొనసాగుతున్న వాణిజ్య వివాదాలకు త్వరలోనే చెక్‌ పెట్టనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇందుకు వీలుగా ఇటీవల కుదిరిన ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేయనున్నట్లు తెలియజేశారు. వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా ఈ నెల మొదట్లో రెండు దేశాల మధ్య ప్రాధమిక దశ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మరోపక్క ఈ అంశంపై

Most from this category