News


ట్రేడ్‌వార్‌ కంటే ఆయిల్‌, రూపీ పెద్ద రిస్క్‌లు!

Saturday 22nd June 2019
Markets_main1561142622.png-26480

పన్ను తగ్గింపులు, గ్రామీణ, చిన్న, పెద్ద పట్టణాల్లో వినియోగానికి ఊతమిచ్చే నిర్ణయాలు వచ్చే నెల కేంద్ర బడ్జెట్‌లో ఉండొచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ మయురేష్‌ జోషి అంచనా వేశారు. వ్యక్తులకు సంబంధించి పన్న రేట్ల కోత ఉండొచ్చని, పలు మినహాయింపులతోపాటు భారీ ఉద్యోగాలు కల్పించే ఎంఎస్‌ఈ, ఎంఎస్‌ఎంఈలకు పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఉండొచ్చన్నారు. అజెండాలో కార్పొరేట్‌ పన్ను కోత ఉన్నప్పటికీ, నిధుల సమీకరణ లక్ష్యాలపై ఉన్న ఒత్తిళ్లు దృష్ట్యా దీన్ని చేయకపోవచ్చన్నారు. 

 

మోదీ రెండో విడత ప్రభుత్వ పాలనలో వినియోగ రంగం మంచి వృద్ధిని నమోదు చేయవచ్చని మయురేష్‌ జోషి అంచనా వేశారు. ఈ విభాగంలో ఆహార ఉత్పత్తులు, రోజువారీ వినియోగ ఉత్పత్తులు, ప్రైవేటు బ్యాంకింగ్‌కు సానుకూలంగా ఉంటుందన్నారు. అలాగే, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఇది నిర్మాణ రంగం కంపెనీలకు ఆర్డర్లు సమృద్ధిగా తెచ్చిపెట్టడంతోపాటు క్యాపిటల్‌ సైకిల్‌ టర్న్‌ అరౌండ్‌కు తోడ్పడుతుందని చెప్పారు. అందుబాటు ధరల్లో గ్రామీణ, పట్టణ ఇళ్లకు కూడా మద్దతు ఉంటుందని అంచనా వేశారు. సిమెంట్‌ కంపెనీలకు సానుకూలమన్నారు. 

 

‘‘మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఏడాదిన్నర నుంచి తిరిగి కోలుకోలేదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల వర్గీకరణలో మార్పులు, దీర్ఘకాలిక లాభాలపై పన్ను వంటి అంశాలు ఇందుకు దారితీశాయి. మంచి బలమైన వ్యాపార నమూనాలు ఉండి, చక్కని కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఉన్న మిడ్‌క్యాప్స్‌పై దృష్టి పెట్టాలి. మిడ్‌క్యాప్‌ ర్యాలీ అన్నది రూపాయి, చమురు ధరలపై ఆధారపడి ఉంది. ఈ రెండూ అంశాలు రానున్న రోజుల్లో మిడ్‌క్యాప్‌ ర్యాలీకి మద్దతుగా ఉంటాయని అంచనా వేస్తున్నాం’’ అని మయురేష్‌ జోషి తెలిపారు. 

 

ఈ సమయంలో స్టాక్స్‌ కొనుగోలు చేసుకోవచ్చా? లేక వేచి చూడాలా? అన్న ప్రశ్నకు... ‘‘మార్కెట్లకు ఇది కనిష్టం అని చెప్పడం కష్టం. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పుంజుకోవడం, ప్రైవేటు మూలధన నిధుల వ్యయాలు అన్నవి ఆర్థిక సంవత్సరం ద్వితీయ భాగంలో సాధ్యపడతాయని అంచనా. మార్కెట్‌ ప్రీమియం వ్యాల్యూషన్లకు ఇవే సమంజస అంశాలు. అంతర్జాతీయంగా సెంట్రల్‌ బ్యాంకులు మానిటరీ పాలసీలను సులభతరం చేసే దిశగా వేస్తున్న అడుగులు... ఈక్విటీ మార్కెట్లకు తగినంత లిక్విడిటీని ఇచ్చేవి. ఈ మార్కెట్లలో మొత్తం ఒకే సారి పెట్టుబడి పెట్టకుండా, క్రమంగా కొనుగోలు చేసుకోవడం సూచనీయం’’ అని జోషి వివరించారు. You may be interested

మార్కెట్లు బుల్లిష్‌... స్టాక్స్‌ బేరిష్‌

Saturday 22nd June 2019

ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మంచి బుల్స్‌ జోరు మీద ఉన్నాయి. సూచీలు దిద్దుబాటుకు లోనవడం, అంతే వేగంగా ఆ నష్టాలను పూడ్చేచుసుకుని మళ్లీ లాభాల మెరుపులు మెరిపించడం చూస్తున్నాం. గతేడాది నుంచి చూసుకుంటే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో చాలా వరకు భారీగా నష్టపోయినవే. కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లోని ఎంపిక చేసిన కొన్ని షేర్లు ర్యాలీ చేస్తూ సూచీలను బలంగా నిలబెడుతున్నాయి. దీంతో మార్కెట్లు బుల్లిష్‌గా కనిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది జియో ఐపీఓ?!

Friday 21st June 2019

వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో జియోను పబ్లిక్‌ ఆఫర్‌కు తెచ్చేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అయితే అంతకన్నా ముందు తమ టవర్లు, ఫైబర్‌ అసెట్ల నిర్వహణ చూస్తే ఇన్విట్స్‌కు ఇన్వెస్టర్లను తీసుకురావాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది. గతవారం జియో ఐపీఓ యత్నాలు జోరందుకున్నాయని సంకేతమిచ్చే పలు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో టెలికం వినియోగదారుల పరంగా టాప్‌లోకి వస్తామని జియో వివిధ బ్యాంకర్లకు తెలియజేసింది. ఇదే జరిగితే కంపెనీ రెవెన్యూ

Most from this category