News


పెరిగిన మధ్య ప్రాచ్య ఒత్తిళ్లు..పెరిగిన చమురు

Friday 19th July 2019
Markets_main1563510144.png-27165

 హార్ముజ్‌ జలసింధి వద్ద అమెరికా నావీ ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేయడంతో శుక్రవారం చమురు ధరలు 1 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.75 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.1 శాతం పెరిగి బ్యారెల్‌కు 55.91 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.  గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 2.7 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 2.6 శాతం నష్టపోయి ముగిశాయి. 
  అమెరికా నావీ ఇరాన్‌ డ్రోన్‌ కూల్చివేసిందని గురువారం యూఎస్‌ అధికారులు తెలపగా, ఎటువంటి డ్రోన్‌ను కోల్పోలేదని ఇరాన్‌ పేర్కొనడం గమనర్హం.  ఇరాన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో బ్రిటన్‌ ట్యాంకర్‌ను అడ్డుకున్న తర్వాత తన షిప్పింగ్‌ ప్రయోజనాలను కాపాడడానికి ప్రయత్నిస్తామని బ్రిటన్‌ ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో అంతరాయాలు లేని మార్గాన్ని ప్రారంభించడానికి యునైటెడ్ స్టేట్స్ "దూకుడుగా" పనిచేస్తుందని యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ కెన్నెత్ మెకెంజీ అన్నారు. అయినప్పటికీ, దీర్ఘకాలిక దృక్పథంలో చమురు బేరిషగానే ఉంది. 
 అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ వలన అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మందగించిందని, ఫలితంగా 2019 చమురు డిమాండ్‌ అంచనాలను తగ్గించామని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురువారం తెలిపారు. ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధి అంచనాలను రోజుకు 11 లక్షల బ్యారెళ్లకు (బిపిడి) సవరించామని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే ఈ కోత ఇంకా ఉంటుందని ఫాతిహ్‌ బిరోల్‌ తెలిపారు. ‘గత మూడు దశాబ్దాల కంటే తక్కువ ఆర్ధిక వృద్ధిని చైనా నమోదు చేసింది. కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా మందగమనంలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాల కంటే తక్కువగా ఉంటే వచ్చే నెలల్లో మరోసారి ఈ కోత ఉంటుంది’ అని బిరోల్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.  గత ఏడాది చమురు డిమాండ్ 2019లో 15 లక్షల బిపిడికి పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది కానీ  ఈ ఏడాది జూన్లో ఈ వృద్ధి అంచనాలను 12 లక్షల బిపిడిగా తగ్గించింది.
  గత వారం బారీ హరికేన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో వెళ్ళినప్పటి నుంచి అమెరికా ఆఫ్‌షోర్ చమురు, గ్యాస్ ఉత్పత్తి  తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఫలితంగా ఉత్పత్తి కోతకు అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో సగటు రోజువారీ ఉత్పత్తిలో 80 శాతం తిరిగి ప్రారంభమైనట్లు గల్ఫ్ అగ్రశ్రేణి ఉత్పత్తిదారు రాయల్ డచ్ షెల్ బుధవారం తెలిపింది.

 You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 19th July 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 39,050 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 11,640 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి

11600 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 18th July 2019

మూడురోజుల ర్యాలీకి బ్రేక్‌ 39000 దిగువన ముగిసిన సెన్సెక్స్‌  మార్కెట్‌ మూడురోజుల వరుసగా ర్యాలీ గురువారం బ్రేక్‌ పడింది. ఇప్పటికి వెలువడిన పలు కార్పోరేట్‌ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. అమెరికా చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తెరపైకి రావడం, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్ భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాను మరోసారి కోత విధించడం మార్కె్‌ట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ

Most from this category