News


స్థిరంగా చమురు

Friday 28th June 2019
Markets_main1561694985.png-26642

ఈ వారం చివరిలో అమెరికా-చైనా దేశాల మధ్య సమావేశం జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్తను వహించారు. ఫలితంగా శుక్రవారం సెషన్‌లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.08శాతం పెరిగి బ్యారెల్‌కు 66.60 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.03శాతం నష్టపోయి 59.41 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల మధ్య సుంకాల పోరు మొదలవ్వడంతో అంతర్జాతీయంగా వృద్ధి మందగించింది. ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌కు డిమాండ్‌ తగ్గింది. దీంతో పాటు ఒపెక్‌, నాన్‌ ఒపెక్‌ దేశాలు జులై 1-2 న వియన్నాలో సమావేశమవుతుండడంతో వీటిపై కూడా ఇన్వెస్టర్లు దృష్ఠిపెట్టే అవకాశం ఉంది. 
 



You may be interested

పసిడి 15 డాలర్లు జంప్‌

Friday 28th June 2019

అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు పసిడి ధరకు అనుకూలిస్తున్నాయి. ఫలితంగా పతనమైన ప్రతిసారి తిరిగి ర్యాలీ చేస్తున్నాయి. పసిడి ధర ఈవారంలో 6నెలల గరిష్టం(1,433.30డాలర్లు) వద్దకు చేరుకున్న నేపథ్యంలో రెండురోజులుగా లాభాల స్వీకరణతో 1400 డాలర్ల స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే.., నేడు ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ధర అనూహ్యంగా లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో 15డాలర్ల వరకు పెరిగి 1,427.75డాలర్ల స్థాయికి చేరుకుంది. రేపు జపాన్‌లో జరిగే జీ-20

69 దిగువకు రూపీ

Friday 28th June 2019

డాలర్‌ మారకంలో రూపీ శుక్రవారం(జూన్‌ 28) ట్రేడింగ్‌లో 8 పైసలు బలపడి 68.98 వద్ద ట్రేడవుతోంది. చమురు ధరలు తగ్గడంతో పాటు అమెరికా డాలర్‌ బలహీనంగా ఉండడంతో గత సెషన్‌లో రూపీ 8 పైసలు బలపడి 69.06 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 11 తర్వాత రూపీ 69 కిందకు రావడం ఇదే మొదటి సారి.   ఈ వారం చివరిలో అమెరికా-చైనా సమాశం జరగనుండడంతో మదుపర్లు జాగ్రత్తను

Most from this category