News


భారీ పతనం తర్వాత స్థిరంగా చమురు

Wednesday 17th July 2019
Markets_main1563336806.png-27112

అమెరికా చమురు నిల్వలు అంచనాల కంటే తక్కువ పడిపోవడంతో పాటు, అమెరికా ఇరాన్‌ మధ్య ఘర్షణ వాతవారణం కారణంగా చమురు  ధరలు బుధవారం ట్రేడింగ్‌లో(జులై 17) స్థిరంగా ఉన్నాయి.  బెంచ్‌మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.51 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.63 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో డిమాండ్‌ భయాల కారణంగా బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 3.2 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 3.3 శాతం నష్టపోయి ముగిశాయి.  ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై చర్చలు జరపడానికి నిరాకరించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో మం‍గళవారం ప్రకటించారు. కానీ ఇది ఇరాన్‌తో  ఉన్న వివాదాలపై అమెరికా పురోగతి సాధించిందని ట్రంప్‌ చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఉండడం గమనర్హం. అమెరికా- ఇరాన్‌ ఉద్రిక్తతలు చమురు ధరలకు మద్ధతునిచ్చాయి. దీంతో పాటు హరికేన్‌ ప్రభావం వలన చమురు అమెరికా చమురు నిల్వలు తగ్గాయి. కానీ ఈ తగ్గుదల అంచనాల కంటే తక్కువగా ఉంది. 
‘గత వారంలో(జులై 12 వరకు ) అమెరికా చమురు నిల్వలు 27 లక్షల బ్యారెల్‌లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే ఇది 14లక్షల బ్యారెల్లు తగ్గి 4,600 లక్షల బ్యారెల్లకు చేరుకుంది. దీంతో పాటు  గ్యాసోలిన్‌ నిల్వలు 925,000 బ్యారెల్లా తగ్గుదలను అంచనా వేయగా అది 476,000 బ్యారెల్స్‌గా నమోదయ్యింది. డీజిల్‌, హీటింగ్‌ ఆయిల్‌ వంటి స్వేదన ఇందనాల నిల్వలు 61.3 లక్షలు పెరుగుతాయని అంచనా వేయగా ఇది 62 లక్షలు పెరిగింది’ అని అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం తెలిపింది. ఈ డేటాపై అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి  అధికారిక డేటా ఈ రోజు విడుదలకానుంది. బారీ హరికేన్ వలన అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో రోజువారీ ముడి చమురు ఉత్పత్తి మంగళవారం కూడా ఆఫ్‌లైన్‌లోనే ఉందని యుఎస్ డ్రిల్లింగ్ రెగ్యులేటర్ తెలిపింది. You may be interested

డాలర్‌ ఎఫెక్ట్‌: తగ్గుముఖం పట్టిన పసిడి

Wednesday 17th July 2019

డాలర్‌ రికవరితో పసిడి ధర బుధవారం తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో నేడు ఔన్స్‌ పసిడి ధర 5 డాలర్లు నష్టపోయి 1,406డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ నిన్నరాత్రి జూన్‌ మాసపు రిటైల్‌ అమ్మకాల గణాంకాలు విడుదల చేసింది. జూన్‌లో రిటైల్‌ అమ్మకాల గణాంకాలు 0.1శాతంగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేయగా, అంచనాలకు మించి 0.4శాతంగా నమోదయ్యాయి. దీంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 17th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  పంజాజ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌:- ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్‌పై వడ్డీరేట్లను 8.70శాతానికి పెంచింది. జూన్‌ 16 నుంచి సవరించిన వడ్డీరేట్ల అమల్లోకి రానున్నాయి.  ఐఎల్‌ఎఫ్‌సీ ఇంజనీరింగ్స్‌:- ఆడిట్‌ ఫీజు పేమెంట్‌ చెల్లింపు విఫలమవడంతో బీఎస్‌ఆర్‌ అండ్‌ అసోసియేట్స్‌ అడిటర్‌ సంస్థ రాజీనామా పత్రాన్ని సమర్పించింది.  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్స్‌:- కార్పొరేట్ పాలన లోపం గురించి రాకేష్‌ గంగ్వాల్‌ లేవనెత్తిన ఆరోపణలపై కార్పోరేషన్‌ మంత్రిత్వశాఖ వివరణ

Most from this category