News


పెరిగిన చమురు!

Thursday 22nd August 2019
Markets_main1566448792.png-27939

యుఎస్‌ క్రూడ్‌ నిల్వలు అగష్టు 16తో ముగిసిన వారంలో అంచనాల కంటే తగ్గడంతో చమురు ధరలు గురువారం పెరిగాయి. కానీ అంతర్జాతీయ మందగమన భయాలు, చమురు డిమాండ్‌ దృక్పథం, పెరుగుతున్న ఇతర ఇంధన నిల్వలు చమురు లాభాలను పరిమితం చేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బారెల్‌ 60.57 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బారెల్‌ 56.03 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రిఫైనరీలు ఉత్పత్తిని పెంచడంతో యుఎస్ క్రూడ్‌ జాబితా గత వారం ఊహించిన దానికంటే అధికంగా పడిపోయింది. కానీ గ్యాసోలిన్, డిస్టిల్లేట్‌ నిల్వలు అంచనాల కంటే పెరిగాయని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్(ఈఐఏ) బుధవారం తెలిపింది. ఆగస్టు 16తో ముగిసిన వారంలో యుఎస్‌ క్రూడ్‌ జాబితా 27 లక్షల బారెల్స్ పడిపోయింది. కాగా ఈ పతనం 19 లక్షల బ్యారెల్స్‌గా ఉంటుందని అంచనా వేశారు. కానీ గ్యాసోలిన్ నిల్వలు 312,000 బారెల్స్ పెరగగా, డిస్టిల్లేట్‌ సరఫరా 26 లక్షల బారెల్స్‌ పెరగడం గమనార్హం. ‘వాణిజ్య అనిశ్చితులు కొనసాగితే, అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌కు తగ్గుతుందనే ఆందోళనలలో ఇన్వెస్టర్లు ఉన్నారు’ అని వాలర్ మార్కెట్స్‌లో మేనేజింగ్ భాగస్వామి స్టీఫెన్ ఇన్నెస్ అన్నారు. 
 



You may be interested

డీఎల్‌ఎఫ్‌ భారీ పతనం..నష్టాల్లో రియల్టీ షేర్లు

Thursday 22nd August 2019

హర్యానాలోని డీఎల్‌ఎఫ్‌ ల్యాండ్‌-బ్యాంక్‌పై కొనసాగుతున్న న్యాయసంబంధిత విషయాలను డీఎల్‌ఎఫ్‌ తన షేర్‌హోల్డర్ల నుంచి దాచి పెట్టిందని సుప్రీం కోర్టు ఈ సంస్థకు నోటిసులను జారీ చేసింది ఫలితంగా ఈ సంస్థ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నాయి. డీఎల్‌ఎఫ్‌ దెబ్బతో ఇతర రియల్‌ఎస్టేట్‌ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఉదయం 10.12 సమయానికి 6.30 శాతం నష్టపోయి 242.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో

నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా:ఐటీసీ

Thursday 22nd August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నోట్‌బుక్స్‌ మార్కెట్‌ దేశంలో రూ.6,000 కోట్లుంది. ఈ రంగంలో ఐటీసీ క్లాస్‌మేట్‌కు 25 శాతం వాటా ఉందని కంపెనీ ఎడ్యుకేషన్‌, స్టేషనరీ ప్రొడక్ట్స్ బిజినెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శైలేంద్ర త్యాగి తెలిపారు. పల్స్‌ 3డీ నోట్‌బుక్స్‌ను విడుదల చేసిన సందర్భంగా సేల్స్‌ హెడ్‌ రవినారాయణన్‌తో కలిసి  బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిశ్రమ వృద్ధి రేటు ఏటా 4-5 శాతముంది. క్లాస్‌మేట్‌ రెండంకెల వృద్ధి నమోదు

Most from this category