News


బలగాలను మోహరించిన యుఎస్‌..పెరిగిన చమురు

Monday 23rd September 2019
Markets_main1569214410.png-28489

సౌదీ నుంచి చమురు సరఫరాకు అంతరాయం కలగడంతోపాటు, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతవరణం వలన చమురు ధరలు సోమవారం పెరిగాయి. ఉదయం 9.39 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 1.03 శాతం లాభపడి బ్యారెల్‌ 63.85 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.02 శాతం లాభపడి బ్యారెల్‌ 58.68 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
   డ్రోన్‌ దాడి జరిగడంతో సౌదీ చమురు కేంద్రాల నుంచి క్రూడ్‌ ఉత్పత్తి సగానికి పైగా తగ్గింది. ఈ ఉత్పత్తిని సెప్టెంబర్‌ చివరినాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించినప్పటికి ఇన్వెస్టర్లు చమురు సరఫరాపై ఆందోళనగానే ఉండడం గమనార్హం. ‘వేగంగా చమురు సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తారనే ఊహాగానాలు చమురు మార్కెట్‌లో తగ్గాయి’ అని ఎనర్జీ ఎస్పేక్ట్‌ ఎనలిస్ట్‌ విరేంద్ర చౌహాన్‌ అన్నారు. 
   దీనితో పాటు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం కూడా చమురు ధరలకు మద్ధతుగా ఉంది. సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరగడంతో సౌదీకి రక్షణగా యుఎస్‌ తన భద్రాత బలగాలను సౌదీ గల్ఫ్‌ ప్రాంతంలో మోహరించింది. యుఎస్‌, ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ‘నిరోధం, రక్షణ’ ప్రాతిపదికనే యుఎస్‌ తమ బలగాలను సౌదీ గ‍ల్ఫ్‌లో మోహరించిందని యుఎస్‌ సెక్రటరి మైక్‌ పాంపీ ఆదివారం ప్రకటించారు. 
   ట్రోపికల్‌ తుఫాన్‌ ఇమెల్డా తగ్గుముఖం పట్టడంతో యుఎస్‌లో ఎక్సోన్‌ మొబిల్‌ కార్ప్‌, వలెరొ కార్ప్‌ తమ క్రూడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్లను తిరిగి ప్రారంభిం‍చాయి.



You may be interested

ఆల్‌టైం గరిష్ఠానికి ఐసీఐసీఐ బ్యాంక్‌

Monday 23rd September 2019

కేంద్ర ప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీస్థాయిలో లాభపడి ట్రేడవుతున్నాయి. ఈ చర్య వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌ షేర్లు గత సెషన్‌ నుంచి పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 30,000 మార్కును అధిగిమించడం గమనార్హం. పాజిటివ్‌ మార్కెట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకింది. ఈ బ్యాంక్‌ షేరు సోమవారం ఉదయం 10.58 సమయానికి  6.91 శాతం

ఐటీసీ 9.5 శాతం అప్‌

Monday 23rd September 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ సోమవారం ప్రారంభంలోనే 9శాతానికి పైగా లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.249.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పొగాకు ఉత్పత్తులపై శ్లాబ్‌ను పెంచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కౌన్సిల్‌ పొగాకు ఎలాంటి రేటును పెంచకపోవడంతో పాటు హోటల్‌ గదులపై జీఎస్‌టీ తగ్గించింది. ఇక కేంద్రం ప్రకటించిన కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా ఐటీసీ

Most from this category