STOCKS

News


ఒపెక్‌ చర్యలు..పెరిగిన చమురు

Friday 9th August 2019
Markets_main1565324284.png-27651

యుఎస్‌-చైనా వాణిజ్య ఘర్షణ వలన అంతర్జాతీయ వృద్ధి మందగించి, చమురు డిమాండ్‌ పడిపోతుందనే ఆందోళన నేపథ్యంలో చమురు ధరలు నష్టపోతుండగా, చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు(ఒపెక్‌​దేశాలు) ఈ నష్టాలను తగ్గించిందేకు మరిన్ని చర్యలను తీసుకుంటారనే అంచనాల నేపథ్యంలో చమురు ధరలు శుక్రవారం పెరిగాయి. గత సెషన్‌తో పోల్చుకుంటే బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.61 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 52.79 వద్ద ట్రేడవుతున్నాయి. చమురు ధరల పతనాన్ని నిలువరించేందుకు, సౌదీ అరేబియా, ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో సమావేశానికి పిలుపునిచ్చింది. ఫలితంగా గురువారం ఈ రెండు కాంట్రాక్టులు 2 శాతం పైనే లాభపడ్డాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గరిష్ఠాన్ని తాకిన చమురు, ఆ ధరలతో పోల్చుకుంటే 20 శాతం తక్కువలో ట్రేడవుతుండం గమనర్హం. ఇంకా చమురు బేర్‌ గుప్పెట్లో ఉందని విశ్లేషకులు తెలిపారు. 
   యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా నుం‍చి దిగుమతి చేసుకుంటున్న మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల వస్తువులపై సెప్టెంబర్‌ నుంచి 10 శాతం  సుంకాలను విధిస్తానని ప్రకటించడంతో చైనీష్‌ కరెన్సీ యువాన్‌ బలహీనంగా ఉంది. కాగా చైనా ఎగుమతులు జులైలో పెరగడంతో చైనా యువాన్‌ డాలర్‌తో బలపడింది. దీంతోపాటు ఒపెక్‌ దేశాలు, అగష్టు, సెప్టెంబర్‌ నెలలో రోజువారి చమురు ఉత్పత్తిని 70 లక్షల బ్యారెల్‌కు తగ్గించాలని భావిస్తోంది. ఫలితంగా చమురు ధరలకు కొం‍త మధ్ధతు లభించే అవకాశం ఉంది.
   సౌదీ, సెప్టెంబరులో చమురు ఉత్పత్తిని ప్రస్తుతం స్థాయి కంటే తగ్గించే అవకాశం ఉందని, ఇది క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తిరిగి పుంజుకోడానికి సహాయపడుతుందని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్ ఒక నోట్‌లో తెలిపింది. చమురు మార్కెట్‌ను సమతుల్యం చేసే చర్యలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా మద్దతు ఇస్తుందని ఆ దేశ ఇంధన మంత్రి సుహైల్ అల్ మజ్రౌయి గురువారం ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. చమురు మార్కెట్‌ను సమీక్షించడానికి సెప్టెంబర్ 12 న, అబూ ధాబీలో ఒపెక్, నాన్-ఒపెక్ దేశాలు సమావేశం కానున్నాయని ఆయన వివరించారు.  చమురు ధరలను పెంచడానికి ఒపెక్, రష్యాతో కూడిన నాన్‌ ఒపెక్‌ దేశాలు తమ చమురు సరఫరా కోతలను మార్చి 2020 వరకు పొడిగించడానికి జూలైలో అంగీకరించిన విషయం తెలిసిందే.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ జోరు

Friday 9th August 2019

ప్రభుత్వం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌ ను తొలగించడం, డివిడెండ్‌ డిస్ట్రీబ్యూషన్‌ ట్యాక్స్‌ను(డీడీటీ) సులభతరం చేయడం వంటి మార్కెట్‌ ప్రెండ్లీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉండడంతో శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇం‍డెక్స్‌ ఉదయం 9.57 సమయానికి 212.05 పాయింట్లు లాభపడి 28343.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంక్‌

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 9th August 2019

వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు  కేఫ్‌ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:- వీజీ సిద్ధార్థ చివరగా రాసిన లేఖ, కంపెనీ యూనిట్ల ఆర్థిక స్థితిగతులపై పరిశోధనకు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ను  నియమించింది.  యస్‌ బ్యాంక్‌:- క్యూఐపీ ఇష్యూను ప్రారంభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ షేర్ల ఫ్లోర్‌ ధరను రూ.87.9గా నియమించింది. అలాగే కొత్త సీఎఫ్‌ఓ, సీఓఓల పాటు కంపెనీ ప్రధాన అధికారుల నియామకానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాల్కో:- అల్యూమియం ప్లేట్లు,

Most from this category