News


మెక్సికో తుఫాను..పెరిగిన చమురు ధరలు

Friday 12th July 2019
Markets_main1562904772.png-26997

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో తుఫాను కారణంగా అమెరికా ఆయిల్‌ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని సగానికి పైగా నిలిపివేశారు. ఫలితంగా శుక్రవారం(జులై 12) ట్రేడింగ్‌లో ఆయిల్‌ ధరలు పెరిగాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ 0.6 శాతం లాభపడి బ్యారెల్‌కు 66.89 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 60.54 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో మే 23 తర్వాత గరిష్ఠ స్థాయి బ్యారెల్‌ 67.52 డాలర్లకు బ్రెంట్‌ క్రూడ్‌ చేరింది. చివరికి 0.7శాతం తగ్గి ముగిసింది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌  గత సెషన్‌లో  బ్యారెల్‌కు 60.94 డాలర్లు నుంచి 0.38 శాతం తగ్గి క్లోజయ్యింది. ‘ గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో ఏర్పడిన తుఫాను, బ్రిటన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను ఇరాన్‌ నిలిపివేయడంతో మధ్యప్రాచ్యంలో ఒత్తిళ్లు పెరగడం, అమెరికా ఆయిల్‌ నిల్వలు అంచనాల కంటే అధికంగా పడిపోవడం వలన చమురు ధరలు పెరుగుతున్నాయి’ అని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 హరికేన్‌ పొం‍చి ఉండడంతో చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనితో పాటు బ్రిటిష్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ మధ్యప్రాచ్యంలో చిక్కుకోవడంతో గత సెషన్‌లో ఆయిల్‌ ధరలు ఈ నెలలో గరిష్ఠాలను తాకాయి. డబ్యూటీఐ క్రూడ్‌ 4.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 60.43 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ 4.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 66.91 డాలర్ల వద్ద చేరుకున్నాయి.  
     ఇరాన్‌ సముద్ర జలాలకు దగ్గరగా ఉన్నందువలన 5 ఇరానియన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ బ్రిటిష్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను బుధవారం నిలువరించాయి. ఈ విషయంపై బ్రిటష్‌ యుద్ద నౌక ఇరాన్‌ను హెచ్చరించిందని అమెరికా రక్షణ అధికారులు గురువారం తెలిపారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమెన్‌లో ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి, అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేయడంతో గత నెలలో మధ్యప్రాచ్య దేశాలలో తీవ్ర ఒత్తిడి నెలకొన్న విషయం తెలిసిందే. 
    అట్లాంటిక్‌ హరికేన్‌ వలన  అమెరికా ఆయిల్‌ ఉత్పత్తిదారులు చమురు ఉత్పత్తిలో కోతను విధించారు. అంతేకాకుండా అమెరికాలోని అతిపెద్ద ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ పోర్ట్‌ లోసియానాని వర్షం ముంచెత్తడంతో  అమెరికా ఆఫ్‌షోర్‌ చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో పాటు ఊహించని విధంగా అమెరికా చమురు నిల్వలు తగ్గడంతో ఆయిల్‌ ధరలు పెరిగాయి. 31 లక్షల బ్యారెల్లా  చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే అది 95 లక్షల బ్యారెల్లు తగ్గి 4,614 లక్షల  బ్యారెల్‌కు చేరిందని అమెరికా పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌ మంగళవారం తెలిపిన విషయం​తెలిసిందే. 

 



You may be interested

68.45 వద్ద రూపీ ప్రారంభం

Friday 12th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 13 పైసలు బలపడి 68.45 వద్ద శుక్రవారం(జులై 12) ప్రారంభమైంది. అమెరికా ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే అంచనాల నేపథ్యంలో గత సెషన్‌లో ఆసియా కరెన్సీలు బలపడ్డాయి. డాలర్‌ మారకంలో రూపీ గత సెషన్‌లో 7 పైసలు బలపడి 68.58 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం 9.56 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలహీనపడి 68.50 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ సెంచరీ లాభంతో షురూ

Friday 12th July 2019

11600పై ప్రారంభమైన నిఫ్టీ ఇండెక్స్‌  ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 38,941.10 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లను ఆర్జించి 11600 పైన 11,601.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు మరోసారి కొత్త రికార్డు స్థాయిలను అందుకున్నాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బుధవారం జీవికాల గరిష్టాలను

Most from this category